Political News

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన ఎంపీలు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు స‌హా.. ప‌లువురితో క‌లిసి ఆయ‌న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌కు చేరుకున్నారు. అనంత‌రం.. రాష్ట్ర‌ప‌తి గౌర‌వార్థం.. మంగ‌ళ‌గిరి చేనేత చీర‌ల గిఫ్టు ప్యాక్‌ను అందించారు. అంతేకాదు.. అర‌కు కాఫీ గిఫ్టు ప్యాక్‌ను  కూడా బ‌హూకరించారు.

అదేస‌మ‌యంలో తాను రాసిన పుస్త‌కం.. `యువ‌గ‌ళం` సంచికను కూడా రాష్ట్ర‌ప‌తికి అందించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటీవ‌ల పార్ల‌మెంటు ఉభ‌య స‌భలు.. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే బిల్లును పాస్ చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం కేవ‌లం 24 గంట‌ల్లోనే రాష్ట్ర‌ప‌తి ఈ బిల్లుపై సంత‌కం చేశారు. దీంతో అమ‌రావ‌తి రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త చేకూరింది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని లోకేష్.. పార్టీ ఎంపీల‌తో క‌లిసి రాష్ట్ర‌ప‌తిని క‌లుసుకున్నారు.

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించినందుకు రాష్ట్ర‌ప‌తికి నారా లోకేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త‌ల‌తో పాటు.. అమ‌రావతి ప్ర‌త్యేక‌త‌లు కూడా వివ‌రించారు. రాజ‌ధాని ప‌నులు ఎలా సాగుతున్నాయో వివ‌రించారు. ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రంగా దీనిని తీర్చిదిద్దుతున్న‌ట్టు వివ‌రిం చారు. అంతేకాదు.. రానున్న రెండుమూడేళ్ల‌లోనే రాజ‌ధాని పూర్త‌వుతుంద‌న్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి త‌ప్ప‌కుండా  రావాల‌ని.. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తికి ఆయ‌న ఆహ్వానం ప‌లికారు. రాష్ట్ర‌ప‌తి నుంచి తను ఎంతో నేర్చుకుంటున్నాన‌ని.. ఎంతో స్ఫూర్తి పొందుతున్నాన‌ని వివ‌రించారు. ఏపీలో ఎస్సీల‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని.. ఎస్టీలు నివ‌సించే ప్రాంతాల్లో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని వివ‌రించారు.

This post was last modified on April 13, 2026 5:44 pm

Share

Recent Posts

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

1 hour ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

1 hour ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

1 hour ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

3 hours ago