Movie News

మాస్ ప్రేక్షకులకు ‘ముడి’ వేస్తే చాలు

ఈ వారం విడుదల కాబోతున్న ఇరుముడికి మంచి ఓపెనింగ్ దక్కడం ఖాయం. మాస్ మహారాజా ట్రాక్ రికార్డు పక్కన పెడితే వాటి ప్రభావం కన్నా ఎక్కువగా అయ్యప్పస్వామి ఎలిమెంట్ ఏదైతే హైలైట్ చేస్తూ వచ్చారో, అది సానుకూలంగా పని చేసేలా ఉంది. ఇది భక్తి సినిమా కాదని, దీక్ష వేసుకోవడం కథలో ఒక భాగంగా మాత్రమే వస్తుందని దర్శకుడు శివ నిర్వాణ పదే పదే క్లారిటీ ఇవ్వడం చూస్తే, ప్రేక్షకుల మనసులో దీని గురించి సరైన అంచనాలు ఏర్పడాలనే ఉద్దేశం కనిపిస్తోంది.

ముఖ్యంగా ఇరుముడి కనెక్ట్ కావాల్సింది మాస్ ప్రేక్షకులకు. వాళ్ళను కనక మెప్పిస్తే కలెక్షన్ల వర్షం ఖాయం. లెనిన్ చేసింది ఇదే. అయితే అఖిల్ ఇమేజ్ తో పోల్చుకుంటే రవితేజ ఫాలోయింగ్ పెద్దది, అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు ఉంటుంది కాబట్టి నెంబర్లు భారీగా వస్తాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో ప్రియాంకా భవాని శంకర్ హీరోయిన్ కాగా ఆమె కంటే ఎక్కువగా హీరో కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్టునే హైలైట్ చేస్తున్నారు.

విశ్వనాథ్ అండ్ సన్స్ రెండోవారంలో అడుగు పెట్టేనాటికి నెమ్మదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లాస్ జనాలు బాగానే చూస్తున్నారు కానీ రెగ్యులర్ పబ్లిక్ పూర్తి స్థాయిలో టర్న్ కావడం లేదు. మాస్ ఎలిమెంట్స్ లేకపోవడమే కారణం. థియేటర్ మూమెంట్స్ డిమాండ్ చేసే కమర్షియల్ అంశాలకు వెంకీ అట్లూరి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇరుముడి సరిగ్గా వీటినే టార్గెట్ చేసింది. ట్రైలర్లో చూపించిన వార్నింగులు, ఫైట్లు అందులో భాగంగా పెట్టినవే.

ఇరుముడికున్న ఒకే ఒక్క గండం ఆగస్ట్ 26 వచ్చే టాక్సిక్. యష్ హీరోగా రూపొందిన ఈ ప్యాన్ ఇండియా మూవీ ఏపీ తెలంగాణలోనూ పెద్ద రిలీజ్ దక్కించుకోనుంది. దాన్ని తట్టుకోవాలంటే ఇరుముడి అన్ని వర్గాల నుంచి యునానిమస్ టాక్ తెచ్చుకోవాలి. ఎలాగూ టాక్సిక్ కేవలం గ్రోన్ ఆప్స్ కోసమే తీసిందని హీరో చెబుతున్నాడు కాబట్టి పిల్లలు, కుటుంబాలు దానికి దూరంగా ఉంటారు. ఈ అవకాశాన్ని ఇరుముడి సరిగ్గా వాడుకుంటే చాలు బ్రేక్ ఈవెన్ కాదు హ్యాపీగా మంచి లాభాలతో బయట పడొచ్చు. 

This post was last modified on August 18, 2026 11:01 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago