Political News

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన అభిశంస‌న తీర్మాల‌ను పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు తోసిపుచ్చాయి. దీంతో ఆయ‌న‌పై ఎలాంటి అభిశంస‌న తీర్మానం ఉండ‌దు. పైగా.. రాజ్య‌స‌భ చైర్మ‌న్ దీనిపై కామెంటు చేయ‌డం కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ తీర్మానానికి `వాల్యూ` లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. ఈ మేర‌కు సోమ‌వారం రాత్రి 10 గంట‌ల త‌ర్వాత‌.. రాజ్య‌స‌భ స‌చివాల‌యం ప్ర‌క‌టించ‌డం మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇక‌, లోక్‌స‌భ గ‌తంలోనే తీర్మానాన్ని తోసిపుచ్చింది.

ఏం జ‌రిగింది?

దేశ‌వ్యాప్తంగా ఓట‌ర్ల జాబితాను స‌వ‌రించే ప్ర‌క్రియ చేప‌ట్టిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌ని విప‌క్షాలు ఆరోపించాయి. వాస్త‌వానికి స్పెష‌ల్‌ ఇంటెన్సివ్ రివిజ‌న్ (స‌ర్‌)ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దాదాపు 50 ఏళ్ల త‌ర్వాత‌.. దీనిని చేప‌ట్టిన‌ట్టు కూడా పేర్కొంది. తొలుత బీహార్‌లో దీనిని చేప‌ట్టారు. అయితే.. ఇది అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా ప్ర‌తిప‌క్షాల‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టారంటూ..కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత‌.. ఆయన అదే రాష్ట్రంలో `ఓట్ అధికార్ యాత్ర‌` పేరుతో పెద్ద యాత్ర కూడా చేప‌ట్టారు.

ఇక‌, ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. ఒకే డోర్ నెంబ‌రుతో వేలాది ఓట్లు ఇచ్చార‌ని.. చ‌నిపోయిన వారిని కూడా బ‌తికిఉన్న‌ట్టు, బ‌తికి ఉన్న‌వారిని సైతం చ‌నిపోయార‌ని పేర్కొంటూ.. ఓట్లు తీసేసి..ఇచ్చే కార్య‌క్ర‌మం చేప‌ట్టార‌ని కూడా ఆరోపించారు. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు స‌హా ప‌లు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం కూడా చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్‌కుమార్ కేంద్రంగా దాదాపు 8 విప‌క్ష పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా దండెత్తారు. ఇలా.. మొద‌లైన ఉద్య‌మం ఆయ‌నను ఆ ప‌ద‌వి నుంచి దించేయాల‌న్న డిమాండ్ కు దారి తీసింది.

130 మంది సంత‌కాల‌తో..

జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలంటే.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిని అభిశంసించే ప్రక్రియ‌కు స‌రిస‌మాన‌మైన విధానాన్నే అనుస‌రించాలి. ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ తీర్మానం ప్ర‌వేశ పెట్టి.. దీనిపై చ‌ర్చ చేప‌ట్టాలి. ముందుగా ఈ తీర్మానాన్ని బ‌ల‌ప‌రుస్తూ.. ఆయా స‌భ‌ల్లోని స‌భ్యులు తీర్మాన ప్ర‌తుల‌పై సంత‌కాలు చేయాలి.

ఇలా లోక్‌స‌భ‌లో 130 మంది స‌భ్యులు సంత‌కాలు చేశారు. రాజ్య‌స‌భ‌లో 63 మంది స‌భ్యులు సంత‌కాలు చేశారు. వీటిపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని తాజాగా వాయిదా ప‌డిన బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే ప‌ట్టుబ‌ట్టారు. కానీ, అటు లోక్‌స‌భ‌, ఇటు రాజ్య‌స‌భ కూడా తీర్మానాల‌ను ర‌ద్దు చేశాయి. అయితే.. దీనికికార‌ణాలు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా జ్ఞానేష్‌కుమార్ ప్ర‌స్తుతానికి సేఫ్ అయిపోయారు.

This post was last modified on April 7, 2026 11:48 am

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

56 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

1 hour ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

2 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

2 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

2 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

3 hours ago