Political News

తండ్రి బాటలోనే పేర్ని కిట్టు

అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి ఎగబడిపోతూ ఉంటారు. తాను చెప్పిందే వేదమంటూ ఆయన చేస్తున్న వాగ్వాదాలు వైరల్ అవుతూ ఉంటాయి. నాని రాజకీయ వారసత్వం పుచ్చుకున్న ఆయన కుమారుడు పేర్ని వాక సాయి కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కొట్టు కూడా అచ్చూ తన తండ్రి మాదిరే వ్యవహరిస్తున్నారు. అధికారులన్నా, పోలీసులన్నా ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదు. తాజాగా ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ పై ఆయన ఎగబడిపోయిన వైనం వైరల్ గా మారింది.

పేర్ని కిట్టు పోలీసులపైకి ఎందుకు ఎగబడిపోయారన్న విషయానికి వస్తే…మచిలీపట్నంలోని కొబ్బరితోట ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మించిన ఓ కట్టడాన్ని కూల్చేవేసేందుకు అధికారులు అక్కడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని కిట్టు…మందీమార్చలాన్ని వెంటేసుకుని హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపైకి ఆయన ఎగబడిపోయారు. ఈ సందర్భంగా మర్యాద పాటించాలంటూ కిట్టుకు ఇనుకుదురుపేట సీఐ పరమేశ్వరరావు సూచించారు. ఈ మాటతో ఒక్కసారిగా స్వరం పెంచేసిన కిట్టు… పరమేశ్వరరావుపైకి ఎగబడిపోయారు.

నీకు మర్యాద ఇవ్వడమేమిటంటూ కిట్టు పోలీసు అధికారిని ఏకవచనంతో సంబోధించారు. ఇదేం పద్దతి అని సీఐ ప్రశ్నించగా… నీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ… నీవేం చేస్తున్నావో నాకన్నీ తెలుసునంటూ కిట్టు మరింతగా ఫైరైపోయారు. దీంతో కిట్టు, సీఐల మధ్య వాగ్వాదం పెరిగిపోయింది. కిట్టును వారించడానికి బదులుగా మరింత రెచ్చపొమ్మన్నట్లుగా వైసీపీ నేతలు చోద్యం చూడగా… ఇతర పోలీసులు సీఐని పక్కకు లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మచిలీపట్నం నుంచి పేర్ని నాని మూడు పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మూడో సారి విజయం సాధించిన నాని…జగన్ కేబినెట్ లో మంత్రిగా వ్వహరించారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు కిట్టుకు టికెట్ ఇప్పించుకున్న నాని… తాను పోటీకి దూరంగా ఉండిపోయారు. ఈ ఎన్నికల్లో గతంలో పేర్ని నానిని ఓడించిన టీడీపీ  సీనియర్ నేత, మంత్రి కొల్లు రవీంద్ర… కిట్టును కూడా చిత్తుగా ఓడించారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే పోలీసులపైకి ఇంతగా ఎగబడిపోతున్న కిట్టు…ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఇంకెంతగా ఎగసిపడేవారోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on April 2, 2026 1:51 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

7 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

10 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago