Political News

‘సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా?’

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం నాటి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి సీతక్కలు అసలు చర్చను పక్కనపెట్టేసి ఏకంగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని వాదులాడుకున్నారు.

ఈ సందర్భంగా సీతక్క సంధించిన విమర్శలను ప్రస్తావించిన సబిత… సీతక్క ఏమైనా కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకే సీతక్క తనపై అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు వైపు నుంచి సీతక్క వ్యాఖ్యలు… వాటికి సబిత ప్రతి వ్యాఖ్యలు సభలో వేడి పుట్టించాయి.

కాంగ్రెస్ పార్టీ సబితకు లెక్కలేనన్ని అవకాశాలు ఇచ్చిందని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తూ సబిత బీఆర్ఎస్ లో చేరిపోయారని సీతక్క ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సబిత…ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుటుంబాన్ని తనను విమర్శిస్తే సీఎం ఆనందిస్తారన్నట్లుగా వ్యవహారం సాగుతోందని సబిత సెటైర్లు సంధించారు.

కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇచ్చిందని, అదే సమంలో 5 సీబీఐ కేసులు కూడా పెట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన న్యాయం, అన్యాయాలను ప్రస్తావించే హక్కు కూడా తనకు లేదా? అని ఆమె ప్రశ్నించారు. తానేదో పార్టీ మారానని చెబుతుున్న సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా? అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్తీని తాను ఏనాడూ తులనాడలేదన్న సబిత… సీఎం నేరుగా తనపై విమర్శలు గుప్పించాకే తానుు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు.

వాస్తవానికి కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సబిత… రాష్ట్ర విభజన తర్వాత  మారిన రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అదే సమయంలో టీడీపీతో రాజకీయాలను ప్రారంభించిన సీతక్క… రాష్ట్ర విభజన తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

పార్టీ మారిన తర్వాత కూడా బీఆర్ఎస్ సర్కారులో సబిత మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఇక టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత సీతక్క తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టారు. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితురాలిగా మెలగుతున్న సీతక్క… కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు.  ఇలాంటి ఇద్దరు మహిళా నేతల మధ్య శాసనసభలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని మరీ వాదులాడుకోవడం ఆసక్తి రేకెత్తించింది. 

This post was last modified on March 26, 2026 9:17 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

13 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

40 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

50 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

5 hours ago