Political News

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ రచ్చల్లో తమ నేతల తలరాతలు ఎలా ఉంటాయన్న దిశగా జనం రకరకాల సమరణాలను ప్రస్తావించుకుంటున్నారు. ఈ తరహా చర్చలు ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజిలో సాగుతున్నాయి.

ఆయా పార్టీల కీలక నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెబ్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ భవిష్యత్తుపై జరుగుతున్న చర్చ మరింత ఆసక్తి రేపుతోంది. 2029 ఎన్నికల్లో లోకేశ్ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచే పోటీ చేస్తారా?… లేదంటే వేరే నియోజకవర్గానికి మారతారా? అన్న అంశపై జోరుగా చర్చ నడుస్తోంది.

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభనతో పాటుగా అటు లోక్ సభ సీట్లతో పాటు ఇటు అసెంబ్లీ సీట్లలోనూ మహిళలకు 30 శాతం సీట్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం తీర్మానించేసింది. అంటే…ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కొనసాగుతున్న రిజర్వేషన్లతో పాటుగా కొత్తగా మహిళలకు కూడా కొన్ని సీట్లు అందిరానున్నాయి.

మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లలో పోటీ చేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇలా రిజర్వ్ అయ్యే సీట్లలో ప్రస్తుతం పురుష అభ్యర్తులు ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతూ ఉంటే… తదుపరి ఎన్నికల్లో వారు పోటీకి అనర్హులే. మరి మహిళలకు రిజర్వ్ అయ్యే సీట్లను ఎలా ఖరారు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించే సీట్లను ఆయా జిల్లాల్లో సంబంధిత వర్గాల జనాభా అత్యధికంగా గల నియోజకవర్గాలను వారికి కేటాయిస్తారు. ఇప్పుడు మహిళలకు కేటాయించే నియోజకవర్గాల ఎంపికలోనూ ఇదే విదానాన్ని పాటిస్తారు. ఈ లెక్కన ఏఏ జిల్లాల్లో ఏఏ నిజోయకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటారో ఆయా నియోజకవర్గాలు వారికి కేటాయించబడతాయి.

ఇదే ప్రాతిపదికగా ఇప్పుడు ఏపీలోని ఏఏ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారన్న లెక్కలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ జాబితాలో బీమిలి తొలి స్థానంలో ఉంటే… లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి 1,41,514 మంది మహిళా ఓటర్లతో ఆరో స్థానంలో ఉంది.

ఇప్పుడున్న నియోజకవర్గాలను ఏమాత్రం విభజించకుండా మహిళలకు కేటాయిస్టే… మంగళగిరి తప్పనిరసరిగా మహిళలకే రిజర్వ్ అవుతుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతున్న తరుణంలో ప్రస్తుత నియోజకవర్గాలన్ని కొత్త రూపును దాల్చనున్నాయి. ప్రస్తుత పరిమాణం కంటే ఓ మోస్తరు చిన్న నియోజకవర్గాలుగా అవి అవతరించనున్నాయి.

అంటే..మంగళగిరి సహా ప్రతి నియోజకవర్గం కూడా చిన్నగా మారుతుంది. ఆయా నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు వాటిలో నుంచి వీడిపోతాయి. ఇలా వీడిపోయిన మండలాల తర్వాత కూడా మంగళగిరిలో మహిళా ఓటర్ల సంఖ్య ఏ మేర ఉంటుందన్న దానిపై అది రిజర్వ్ డ్ అవుతుందా? లేదా? అన్నది తేలుతుంది. దీనిపై ఇప్పటికిప్పుడేమీ స్పష్టత లేకున్నా.. లోకేశ్ రాజకయ ప్రస్థానం ఓ రేంజిలో పెరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

This post was last modified on March 26, 2026 10:01 am

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

3 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

4 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

5 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

5 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

6 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

7 hours ago