Movie News

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి కెరీర్ వెనుక ఒక పెద్ద చేయి ఉందన్నది కాదనలేని సత్యం.. ఆ చేయి మరెవరిదో కాదు సాక్షాత్తూ రెబల్ స్టార్ ప్రభాస్‌ది. మొదటి నుంచి సంతోష్ శోభన్ కెరీర్ కు ప్రభాస్ గట్టి సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. యూవీ క్రియేషన్స్ లో వరుసగా సినిమా ఛాన్సులు ఇప్పించడమే కాకుండా, తనకు క్లోజ్ గా ఉండే ఇతర నిర్మాతలకు కూడా వీరిని సజెస్ట్ చేసేవాడు. డార్లింగ్ ఇచ్చిన ఆ పుష్ అటు సంతోష్ కి, ఇటు తమ్ముడు సంగీత్ కి కూడా బాగా కలిసొచ్చింది.

ముఖ్యంగా సంగీత్ శోభన్ కు కెరీర్ మొదట్లోనే ‘మ్యాడ్’, ‘మ్యాడ్ 2’ వంటి హిట్లు పడటంతో అతను వెంటనే ట్రాక్ లో పడిపోయాడు. ఇప్పుడు ‘రాకస’ అనే థ్రిల్లర్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో, రీసెంట్ ఇంటర్వ్యూలో సంగీత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శోభన్ దర్శకత్వంలో వచ్చిన ‘వర్షం’ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కాబట్టే ప్రభాస్ వారి కొడుకులను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారని చాలామంది అనుకుంటారు. కానీ సంగీత్ శోభన్ మాత్రం అది కానే కాదంటున్నాడు.

ఒకవేళ ‘వర్షం’ సినిమా డిజాస్టర్ అయ్యి ఉన్నా సరే, ప్రభాస్ తమను ఇలాగే ఎంకరేజ్ చేసేవారని గట్టిగా చెబుతున్నాడు. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ అలాంటిదని, తనని నమ్మిన వారిని లేదా తన వాళ్లు అనుకున్న వారిని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టరని సంగీత్ క్లారిటీ ఇచ్చాడు.

సంగీత్ చెప్పిన ఆ మాటలను బట్టి చూస్తే ప్రభాస్ వారిపై ఎంత ఆప్యాయత చూపించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి ఇతని అన్న సంతోష్ శోభన్ హీరోగా 2015లోనే కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ఇన్నేళ్ళలో 10 సినిమాలు చేస్తే మొన్న వచ్చిన కపుల్ ఫ్రెండ్లితో కమర్షియల్ గా హిట్ కొట్టాడు. సక్సెస్ రాకున్నా ప్రభాస్ అతన్ని వదల్లేదు. మొత్తానికి హిట్టు కొట్టే వరకు అవకాశాలు వచ్చేలా చేశాడు. ఇక సంగీత్ మాత్రం ప్రభాస్ కు పని చెప్పకుండానే తనదైన కామెడీ ట్రాక్ లో ఆఫర్లు అయితే అందుకుంటున్నాడు.

This post was last modified on March 26, 2026 8:26 am

Share

Recent Posts

ఒక చిన్న `క్లాజ్‌`… 2 ల‌క్ష‌లు ఫైన్ వేసింది.. మ‌న‌కూ తెలిస్తే మంచిది!

ఒక్క చిన్న క్లాజ్‌... ఒక మ‌హిళ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌గా.. మ‌రో అధికారికి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల పెనాల్టీ విధించేలా చేసింది.…

4 hours ago

కమెడియన్ని చొక్కా విప్పి నిలబెట్టిన హీరో, డైరెక్టర్?

ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్లుగా చ‌లామ‌ణి అవుతున్న చాలామంది ఒక‌ప్పుడు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ‌వాళ్లే. ఇంట‌ర్వ్యూల్లో వారిని క‌దిపితే.. ఒక‌ప్ప‌టి…

5 hours ago

ఓటిటి బద్దకస్తులు… మిడిల్ క్లాస్ వంద కోట్లు

నటుడు శివాజీ డిమాండ్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ నుంచి మొన్న లెనిన్ దాకా…

7 hours ago

జత్వానీ కేసులో ఐపీఎస్‌లకు భారీ ఊరట… తక్షణమే విధుల్లోకి!

నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు విశాల్‌ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను…

9 hours ago

మూణ్నెల్లు ఒకరినొకరు చూసుకోని విజయ్, రష్మిక

రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని…

9 hours ago

సూర్య 50… రోలెక్స్ అయ్యే ఛాన్సుందా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన యాభై సినిమాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ షూటింగ్…

9 hours ago