Political News

గాడిద వెర్సస్ అడ్డగాడిద.. సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో ఓపక్క సినీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ నడుస్తుంటే.. ఇంకోపక్క రాజకీయ కార్యకర్తలు, అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు గొడవపడడానికి వాళ్లకు కొత్త కారణాలు దొరుకుతుంటాయి. కొన్నిసార్లు చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయిపోతుంటారు. ఐతే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన రోజా సెల్వమణి చేసిన ఒక కామెంట్‌తో గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేడెక్కింది. 

ఆమె తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి, వారి కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉగాది పండుగను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని.. తమ కుటుంబాలతో కలిసి ఉగాది వేడుకలు చేసుకోలేదేంటని విమర్శిస్తూ.. వారిని ‘గాడిదలు’ అంటూ సంబోధించారు రోజా.

ఐతే అదే రోజు సాయంత్రం తిరుపతికి చెందిన జనసేన నేత సుభాషిణి.. ప్రెస్ మీట్ పెట్టి రోజా తీరును దుయ్యబట్టారు. ఆమె జగన్ సతీమణి భారతిని అడ్డగాడిద అని సంబోధిస్తూ.. అధికారంలో ఉన్నపుడు ఈ అడ్డగాడిద ఎక్కడికి పోయింది, తిరుమలకు రాలేదేంటి.. పూజల్లో పాల్గొనలేదేంటి అంటూ విమర్శలు చేశారు.

ఇక అంతే వైసీపీ వాళ్లు పెద్ద ఎత్తున లైన్లోకి వచ్చేశారు. పవన్ కళ్యాణే ఇలా సుభాషిణితో మాట్లాడించాడని.. దీనికి మూల్యం చెల్లించుకుంటారని.. ఎప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు చేయని భారతి రెడ్డి గురించి ఇలా మాట్లాడ్డమేంటని.. కుటుంబాల జోలికి వచ్చి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడమేంటని.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయం అన్న పవన్ కళ్యాణ్‌ ఈ కామెంట్ల మీద ఏం సమాధానం ఇస్తాడని వాళ్లు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఇలా మాట్లాడుతున్న వాళ్లు.. రోజా చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం ఏమీ స్పందించట్లేదు.

తిరుమలకు వెళ్లి రాజకీయ వ్యాఖ్యలు, అందునా దూషణలకు దిగిన రోజును కంట్రోల్ చేయకుండా.. ఆమె భాషలోనే సమాధానం చెప్పిన తమ నాయకురాలిని తప్పుబట్టడం ఏంటి అంటూ జనసైనికులు మండిపడుతున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో స్కూల్ పిల్లల ముందు పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడిన ఘనత జగన్‌దే అని గుర్తు చేస్తూ.. చంద్రబాబు, పవన్‌ల మీద వ్యక్తిగతంగా దారుణమైన మాటలు మాట్లాడిన పోసాని, బోరుగడ్డ, పేర్ని నాని సహా ఎంతోమందిని ప్రోత్సహించింది జగనేనని.. చరిత్ర మరిచిపోయి తమ మీద ఎదురుదాడి చేస్తారా అంటూ జనసైనికులు దీటుగా బదులిస్తున్నారు. దీని మీద రెండు రోజులుగా సోషల్ మీడియా రణరంగంగా మారింది.

This post was last modified on March 23, 2026 10:11 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

18 minutes ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

1 hour ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

2 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

6 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

6 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

8 hours ago