Political News

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 90 శాతం వడ్డీ మాఫీ!

హైదరాబాద్ నగరవాసులకు GHMC ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీని ప్రకటించింది. ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ OTS పథకం కింద ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు. ఈ నెలాఖరు అంటే మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఈ 15 రోజుల్లోపు తమ బకాయిలను క్లియర్ చేసుకుంటే భారీగా వడ్డీ భారం తగ్గుతుంది.

ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ. 1,984 కోట్లు వసూలు కాగా, ఈసారి అది రూ. 2,186 కోట్లకు చేరింది. నగరంలో మొత్తం 28.08 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా, ఇప్పటివరకు 16.80 లక్షల మంది తమ పన్నులు చెల్లించారు. ఇంకా బకాయిలు ఉన్నవారు మీ సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ లేదా MyGHMC మొబైల్ యాప్ ద్వారా సులభంగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు.

కేవలం పన్ను వసూళ్లే కాకుండా, నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మార్చి 6 నుంచి 16 వరకు నగరవ్యాప్తంగా పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చెత్తాచెదారం తొలగించడం, ఫైళ్ల క్లియరెన్స్, ఈ-వేస్ట్ సేకరణ వంటి కార్యక్రమాలను 150 వార్డుల్లో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే బస్ షెల్టర్లు, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు. రేపటి నుంచి నగరంలోని సినిమా థియేటర్లలో ఈ వీడియోలను ప్రదర్శించనున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా గడువులోపు బకాయిలు చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. ఒకవేళ గడువు ముగిసినా పన్నులు చెల్లించకపోతే జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.

This post was last modified on March 17, 2026 1:47 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

39 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

47 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

2 hours ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

6 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

8 hours ago