వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీలో నాయకులు పుంజుకోవడం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్నవారి సంఖ్య మరింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి కనిపించకపోవడం.. కనీసం తమ వాదనను వినిపించుకునే తీరికలోనూ జగన్ లేకపోవడంతో నాయకులు తమ దారులు తాము చూసుకుంటున్నారు. అయితే.. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సరిదిద్దుకునే ప్రయత్నం చేయొచ్చు.
కానీ, జగన్ సొంత జిల్లా కడపలోనే పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడ నాయకులు సమయం చూసుకుని జంప్ చేస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లోనే వైసీపీ చావు దెబ్బతగిలింది. చిత్రం ఏంటంటే.. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నాయకులు .. తర్వాత.. టీడీపీ కి సానుకూలంగా మారిపోయారు. నిజానికి వారు తమ ఖర్చులను ఇవ్వాలని పార్టీని అభ్యర్థించారు. ఆ ఎన్నికల్లో తాము పదేసి లక్షల చొప్పున అప్పులు చేసి తెచ్చి ఖర్చు చేశామని చెప్పారు.
కానీ, వైసీపీ ఎక్కడా వారి రోదనను పట్టించుకోలేదు. దీంతో తర్వాత రెండు మాసాలకే సదరు నేతలు.. టీడీపీకి అనుకూలంగా మారిపోయి.. వైసీపీకి దూరమయ్యారు. ఇక, కడప కార్పొరేషన్‌పై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి దూకుడు అంతా ఇంతా కాదన్నట్టుగా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ సురేష్‌బాబును మార్చినా.. కడప గడ్డపై కార్పొరేషన్‌ను సొంతం చేసుకునేందుకు మాధవీ రెడ్డి శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ సైకిల్ ఎక్కించారు.
వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లుగా కూడా ఉన్న శివకోటిరెడ్డి, రామ్‌లక్ష్మణ్‌రెడ్డిలు .. తాజాగా ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. ఇక, ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కిన నేపథ్యంలో వీరి చేరికతో ఈ సంఖ్య 10కి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి కార్పొరేషన్‌ను దక్కించుకుంటామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం. మరి సొంత ఇలాకాలో ఇంత జరుగుతున్నా.. జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు. మరోవైపు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on February 28, 2026 3:54 pm
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…