దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. అన్ని శివాలయాల్లోనూ ఈ వేడుకలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే.. ఏపీ అసెంబ్లీలో ఒక రోజు ముందుగానే మహా శివరాత్రి ముచ్చట కనిపించింది. టీడీపీ సహా కూటమిలోని అన్ని పార్టీలకు చెందిన మహిళా మంత్రులు, ఎమ్మె ల్యేలు(ఒకరిద్దరు మినహా) మహా శివరాత్రిని తలపించే వస్త్ర ధారణతో హాజరయ్యారు. శివరాత్రి రోజు శివత త్వంతో కూడిన వస్త్రాలను ధరిస్తారు.
అచ్చంగా అలాంటి వస్త్రాలనే ధరించిన మహిళా నాయకులు సభకు వచ్చారు. బడ్జెట్ ప్రసంగం సహా.. ఇతర కార్యక్రమాల్లోనూ.. ఆ వస్త్రాలతోనే సభలో కూర్చున్నారు. మహిళా నేతలు.. ముదురు ఎరుపు రంగు బ్లౌజ్‌లు, అదే రంగు బార్డర్‌తో ఉన్న కాషాయ చీరలను ధరించారు. ఈ రంగును శివతత్వానికి ప్రతీకగా భావిస్తారు. వీటిని మంగళగిరిలోని చేనేత కార్మికులు రూపొందించినట్టు తెలిసింది. అంతేకాదు.. మంత్రి నారా లోకేష్ ఈ చీరలను మహిళలకు కానుకగా ఇచ్చారు.
దీంతో అందరూ శనివారమే ఈ వస్త్రాలను ధరించి అసెంబ్లీకి రావడంతో ముందస్తు శివరాత్రి వేడుకలు నిర్వహించినట్టుగా అసెంబ్లీ ప్రాంగణం కనిపించింది. వీరు అవే వస్త్ర ధారణలతో సీఎం చంద్రబాబును, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడులను కలుసుకున్నారు. మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. వాస్తవానికి ఆదివారం మహా శివరాత్రి కావడంతో ఆ రోజు.. సభకు సెలవు ప్రకటించారు.
దీంతోపాటు సోమవారం కూడా.. సభకు సెలవు కావడంతో శనివారమే మహిళా నేతలు ఇలా శివతత్వాన్ని తెలిపే వస్త్రాలతో సభకు రావడం గమనార్హం. ఇలా.. ఒకే రకమైన వస్త్రాలు ధరించి సభకురావడం ఇదే తొలిసారి కూడా కావడం మరో విశేషం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ మహిళా నేతలు ఈ విధంగా ప్రత్యేకతను చాటడంపై సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంతోషం వ్యక్తం చేశారు.
This post was last modified on February 15, 2026 12:09 pm
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…