Movie News

అవకాశాన్ని కపుల్ వాడుకోవాలి

శివరాత్రి పండగ సీజన్ సంక్రాంతి, దసరా అంత పెద్ద సీజన్ కాకపోయినా సెకండ్ సాటర్డేతో కలిపి లాంగ్ వీకెండ్ రావడంతో చెప్పుకోదగ్గ సినిమాలే పోటీలో ఉన్నాయి. ఉన్నంతలో డీసెంట్ టాక్ వచ్చింది కపుల్ ఫ్రెండ్లీకే. యునానిమస్ కాదు కానీ యూత్ ఇందులో ఎమోషన్ కి బాగానే కనెక్ట్ అయిన వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

ఓపెనింగ్ కొంచెం వీక్ గానే వచ్చింది. హైదరాబాద్ లాంటి ఏరియాల్లో వేగంగా పుంజుకోగా బిసి సెంటర్స్ లో ఇంకా నెంబర్లు పెరగాల్సి ఉంది. ఇప్పుడొచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఆదివారం గట్టిగానే లాగొచ్చు. కాకపోతే ప్రేమికుల రోజు కోసం శనివారం రిలీజ్ చేయడం వల్ల ఒక రోజు తగ్గినట్టు అయ్యింది.

కపుల్ ఫ్రెండ్లీని నిలబెట్టాల్సింది యూతే. హెవీ ఎమోషన్స్ ఉన్న కారణంగా కుటుంబ ప్రేక్షకులని ఏ మేరకు థియేటర్లకు రప్పించగలుగుతుందో చెప్పలేం కానీ యువత సపోర్ట్ చేస్తే మాత్రం పికప్ చూడొచ్చు. అయితే ఇక్కడో రిస్క్ ఉంది. ఈ సినిమా లిటిల్ హార్ట్స్ లాగా ఎంటర్ టైన్మెంట్ నిండింది కాదు. రాజు వెడ్స్ రాంబాయి లాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో మ్యూజిక్ అండ్ ట్విస్టుల మీద ఆధారపడింది కాదు.

సెకండాఫ్ లో బరువైన భావోద్వేగాలు ఉంటాయి. ప్రేమలో పడితే తప్ప కనెక్ట్ కామేమో అనిపించే ఎలిమెంట్స్ వస్తాయి. ఇవి క్లిక్ అయితే కపుల్ ఫ్రెండ్లీ కమర్షియల్ గా చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకుంటుంది.

అంకెల్లో చూస్తే ప్రస్తుతానికి కపుల్ ఫ్రెండ్లీ కన్నా ఫంకీ అమ్మకాలే కొంచెం మెరుగ్గా ఉన్నాయి కానీ ఫైనల్ స్టేటస్ గురించి అప్పుడే ఎలాంటి కంక్లూజన్ కు రాలేం. ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. అన్ని పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యుంటే పరిస్తితి వేరేలా ఉండేదనే కామెంట్ లో నిజం లేకపోలేదు.

సంతోష్ శోభన్ కు కపుల్ ఫ్రెండ్లీ హిట్ కావడం చాలా కీలకం. టైటిల్ కూడా ఆడియన్స్ పరంగా కొంత పరిమితి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. అర్జున్ సీత పయనంకు కూడా మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపథ్యంలో ఫైనల్ విన్నర్ ఎవరో తేలేందుకు ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. 

This post was last modified on February 15, 2026 9:19 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

6 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

6 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

7 hours ago