Political News

ఆ కేసులోనూ అంబటికి బెయిల్.. రేపు విడుదల?

సీఎం చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది నవంబర్ 12న పోలీసుల విధులను అడ్డుకున్నారన్న కేసులో అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పై ఉన్న విషయం విదితమే.

ఈ నేపథ్యంలోనే తాజాగా అంబటికి కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఆ కేసులోనూ అంబటికి బెయిల్ లభించింది. ఈ క్రమంలోనే జైల్లో ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదలయ్యే అవకాశముంది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో అంబటిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు కోర్టులో పట్టాభిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

తాజాగా ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో అంబటి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉంది.

This post was last modified on February 11, 2026 2:49 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

14 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago