Political News

అభిమానం అంతదూరం నడిపించింది..

సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర అలిపిరికి చేరుకుంది. మెట్ల మార్గంలో ఆయన శ్రీవారి సన్నిధికి బయలుదేరారు. జనవరి 19న హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌ నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సుమారు 507 కిలోమీటర్లు సాగి సోమవారం తిరుపతికి చేరింది.

మార్గమధ్యంలో పలుచోట్ల అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు కలిసి ఆయనకు మద్దతుగా నడిచారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే ఈ సంకల్పయాత్ర చేపట్టినట్లు బండ్ల గణేశ్ వెల్లడించారు.

గతంలో స్కిల్ కేసు సమయంలో చంద్రబాబు అరెస్టు కావడంతో తీవ్రంగా కలత చెందినట్లు పేర్కొన్నారు. “ఆయన సురక్షితంగా బయటకు వస్తే కాలినడకన శ్రీవారి దర్శనానికి వస్తాను” అని అప్పుడే మొక్కుకున్నానని చెప్పారు. ఆ సంకల్పం నెరవేరినందున ఇప్పుడు పాదయాత్ర పూర్తి చేశానని తెలిపారు.

ఈ యాత్రకు రాజకీయ సంబంధం లేదని, ఇది పూర్తిగా భక్తి భావంతో చేసినదేనని బండ్ల గణేష్ తన పాదయాత్ర మొదలైన సందర్భంలో స్పష్టం చేశారు..తిరుపతికి చేరుకోగానే “నా గడప నుంచి వెంకన్న గడప వరకూ నడిచి వస్తానని ప్రార్థించాను. ఆ ఏడుకొండల వాడి కృపతో నా సంకల్పం నెరవేరింది” అని బండ్ల గణేశ్ భావోద్వేగంగా తెలిపారు.

పాదయాత్ర చేస్తున్న బండ్ల గణేష్ను 15 రోజుల కిందట మంత్రి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు. కాలినొప్పితో బాధపడుతున్నారని తెలిసి పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కాలినొప్పి నుంచి త్వరగా కోలుకుని, మొక్కు చెల్లించుకోవాలని ఆకాంక్షించారు. గణేష్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను కలిసే అవకాశం ఉందని సమాచారం.

This post was last modified on February 10, 2026 10:37 am

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

24 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

54 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago