Political News

జగన్ అసెంబ్లీకి వస్తున్నారు కానీ…

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు.. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టీ స‌హ‌జంగా ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంది? ఎలాంటి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతుంది? అనే చ‌ర్చ ఉంటుంది. అయితే.. దీనిని మించి ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అన‌గానే.. ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ ఎమ్మెల్యేల గురించి చ‌ర్చే జ‌రుగుతోంది. ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వ‌స్తారా? రారా? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఆయ‌న ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది రెండు సార్లు మాత్ర‌మే స‌భ‌ల‌కు వ‌చ్చారు.

తొలిసారి 2024 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. ఎమ్మెల్యేలుగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ఒక‌సారి స‌భ‌కు వ‌చ్చారు. త‌ర్వాత 2025-26 బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ చేసే ప్ర‌సంగానికి హాజ‌ర‌య్యారు. ఆ స‌మ‌యంలో త‌మ పార్టీనేత‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను నిర‌సిస్తూ.. జ‌గ‌న్ మెడ‌లో న‌ల్ల‌కండువా వేసుకుని స‌భ‌కు రావ‌డం.. ఇది పెద్ద వివాదం కావ‌డం.. ఆ స‌మ‌యంలో పోలీసు సీఐని పేరు పెట్టి హెచ్చ‌రించ‌డం అప్ప‌ట్లో వివాదానికి దారితీశాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. నుంచి స‌భ ప‌లు మార్లు జ‌రిగిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్‌, ఆయ‌న ఎమ్మెల్యేలు ఎవ‌రూ స‌భ‌కు రాలేదు.

ఇక‌, ఇప్పుడు మ‌ళ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయి. 2026-27 వార్షిక బ‌డ్జ‌ట్‌ను స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నుంచి స‌భ నుంచి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు రావాల‌ని పిలుపు వ‌చ్చింది. ఈ మేర‌కు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అంద‌రికీ పంపించిన‌ట్టే.. వైసీపీ ఎమ్మెల్యేల‌కు కూడా ఆహ్వానాలు పంపించారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీ స‌భ‌కు వ‌స్తుందా? రాదా? అనేది ఆస‌క్తిగా మారింది. పైగా ఈ ద‌ఫా స‌భ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌డం.. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండ‌డంతో ఇది కూడా ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే మ‌హిళా మంత్రి సంధ్యారాణి.. టీం 11, 11వ తేదీ నుంచి జ‌రిగే స‌భ‌కు రావాలని స‌వాల్ రువ్వారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న చ‌ర్చ గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతోంది. దీనికి తాజాగా.. వైసీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. స‌భ తొలిరోజు హాజ‌రుకావాల‌ని.. స‌భ్యుల‌కు వైసీపీ కార్యాల‌యం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

తొలిరోజు ఎలానూ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ స‌భ్యులు హాజ‌రు కావాల‌ని.. ఈ వేదిక‌గా.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాలు స‌హా.. తిరుమల శ్రీవారి ల‌డ్డూ, అంబ‌టి రాంబాబు అరెస్టు వంటి వాటిపై స‌భ‌లో నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సో.. మొత్తంగా .. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల తొలి రోజు మాత్రం వైసీపీ స‌భ్యులు స‌భ‌కు రానున్న‌ట్టు తెలిసింది.

This post was last modified on February 10, 2026 11:56 am

Share

Recent Posts

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

30 minutes ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

1 hour ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

2 hours ago

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

3 hours ago

రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…

3 hours ago

దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్…

5 hours ago