Political News

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ నుంచి ద‌క్షిణాది స‌హా ఉత్త‌ర భారతంలో అనేక ధార్మిక సంస్థ‌లు ఉన్నాయి. కంచి కామాక్షీ పీఠం నుంచి శ్రీకృష్ణ మ‌ఠం వ‌ర‌కు.. ఎన్నో సంస్థ‌లు ధార్మిక వాద‌న‌లు చేస్తున్నాయి. ధ‌ర్మాన్ని ప్ర‌బోధిస్తున్నాయి. మ‌రి వీరికి తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ప‌ట్ట‌దా? అనేది ప్ర‌శ్న‌. ఏపీలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు ధార్మిక సంస్థ‌లుగా ఉన్న ఏ ఒక్క‌టీ స్పందించ‌లేదు.

ముఖ్యంగా చిన్న‌జీయ‌రు స్వామి ఆధ్వ‌రంలోని జీయ‌ర్ మ‌ఠం తిరుమ‌ల‌లోనే ఉంది. అదేవిధంగా త‌మిళ‌నాడుకు చెందిన మ‌ఠాలు కూడా అక్క‌డే తిష్ఠ‌వేశాయి. శ్రీవారి కైంక‌ర్యాల‌కు ప్ర‌త్యేక సూచ‌న‌లు కూడా చేస్తున్నారు. అలాంటి సంస్థ‌లు.. శ్రీవారి క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదిక‌పై ఎందుకు మౌనంగా ఉన్నాయ‌న్న‌ది ప్ర‌శ్న‌.

వీరే కాదు.. వ్య‌క్తిగ‌తంగా అనేక మంది మ‌ఠాధిప‌తులు కూడా తిరుమ‌ల శ్రీవారి కొండ‌పై నాచుమొక్క‌ను పీకినా స్పందిస్తారే.. మ‌రి కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల‌కు ఎస‌రు పెడుతూ.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన నెయ్యి క‌ల్తీపై ఎందుకు స్పందించ‌రు?!.

ఆర్ ఎస్ ఎస్ మాటేంటి?

ఇక‌, దేశంలో హిందూత్వ‌కు తామేపునాదులు వేశామ‌ని.. గొడుగులు ప‌డుతున్నామ‌ని చెప్పుకొనే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్‌) ఏం చేస్తోంది.? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దేశంలో ధ‌ర్మాన్ని నిల‌బెడ‌తామ‌ని.. అంద‌రూ ధ‌ర్మాన్ని పాటించాల‌ని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్ ప‌దే ప‌దే చెబుతుంటారు. దేశ‌వ్యాప్తంగా ధ‌ర్మాన్ని కూడా ఆయ‌న ప్ర‌చారం చేస్తుంటారు. మ‌రి అలాంటి వారు ఇప్పుడు ఎందుకు నోరు పెగ‌ల్చ‌లేక పోతున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వ్య‌వ‌హారం ఒక ప్ర‌భుత్వానికి సంబంధించిన వ్య‌వ‌హారం కాదు. కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. అంతేకాదు.. అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడైన శ్రీవారి ప‌విత్ర‌త‌త‌కు సంబంధించిన అంశం. ఇలాంటి అంశాల‌ను చూసీ చూడ‌న‌ట్టు.. వినీ విన‌న‌ట్టు వ్య‌వ‌హరిస్తే.. స‌ద‌రు మ‌ఠాలు, ధార్మిక సంస్థ‌లు, ఆర్ ఎస్ ఎస్ వంటి హిందూత్వ సంస్థ‌లు భ‌విష్య‌త్తు వ‌ర్గాల‌కు.. ఎలాంటి సందేశాన్ని ఇస్తున్న‌ట్టు?! అనేది ఆలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇది రాజ‌కీయ రొచ్చుకాద‌ని.. హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌యమ‌నిగ్ర‌హించి.. వారి వాద‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌లువురు ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on February 7, 2026 8:26 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago