Political News

వైసీపీ రాష్ట్రపతి పాలన కోరుకుంటుందా?

ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రచ్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వెలుపల వైసీపీ ఎంపీలు ఆ వ్యవహారాలపై నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు.

ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, తమకు న్యాయం కావాలని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన వైసీపీ ఎంపీలు ఏపీలో తాజా పరిస్థితిని వివరించారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని వారు భావిస్తున్నారు.

మరోవైపు, రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు కూడా ఈ విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

ఏపీలో మాజీ మంత్రుల ఇళ్లు తగులబెడుతున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ, షా వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ నానాటికీ దిగజారిపోతోందని చెప్పారు. అయితే, లా అండ్ ఆర్డర్ స్టేట్ కి సంబంధించిన విషయమని రాజ్య సభ ఛైర్మన్ అన్నారు.

This post was last modified on February 3, 2026 7:38 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago