ఇంతకూ కేంద్ర విద్యా శాఖలో ఏం జరుగుతుంది. నీట్ పేపర్ లీకేజి తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరిగిన ఉద్యమంతో వెనక్కి తగ్గినట్టు కనిపించిన కేంద్ర ప్రభుత్వం మరో తప్పుడు నిర్ణయం తీసుకొని సమస్యను కొనసాగించడంలో ఉద్దేశ్యం ఏమిటి. ఈసారి ఒకటి కాదు రెండు తప్పులు చేయడం మొండి తనమా, నిర్లక్ష్యమా అని మేధావులుప్రశ్నిస్తున్నారు .
ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో జోషి…
నీట్ పేపర్ లీకేజి వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమం దేశమంతా అట్టుడికించింది. అనివార్యంగా ఆయన చేత రాజీనామా చేయించిన మోదీ ప్రభుత్వం ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు విస్మయం కలిగిస్తున్నాయని విద్యావంతులు చెబుతున్నారు. ప్రధాన్ స్థానంలో ప్రహ్లాద జోషిని నియమించడం సమస్యను మరింతగా రాజేసినట్లయింది.
జోషి ఏమి చేశారంటే…
గుజరాత్ మత కలహాల సమయంలో దహోడ్ జిల్లా లో బిల్ కిస్ బానో అనే 21 ఏళ్ళ మహిళపై అత్యాచారం జరిగింది. బిల్ కిస్ ను రేప్ చేసిన దుండగులు ఆమె మూడేళ్ల బిడ్డను నేలకేసి బాది చంపేశారన్న ఆరోపణలు వున్నాయి. ఈ కేసులో న్యాయస్థానం 11 మంది నేరస్థులకు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ నిందితులను 2022ఆగస్టు 15 వ తేదీన అజాదీకా అమృత్ మహోత్సవం పేరిట విడుదల చేశారు. నిందితుల విడుదల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ జోషి ప్రకటన చేశారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన నిందితులకు మద్దతు ప్రకటించిన జోషిని కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ప్రకటించడం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇది దేశానికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని మేధావులు చెబుతున్నారు.
విద్యా శాఖ కార్యదర్శిపై అవినీతి ఆరోపణలు..
అసలే విద్యా శాఖలో అవినీతి మితి మీరిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర విద్యా శాఖ కార్యదర్శిగా నరేష్ పాల్ గంగర్వాల్ ను నియమించడంపై వ్యతిరేకత వస్తుంది. 1994 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా పని చేసినప్పుడు దోసకాయల సాగుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని తన కుటుంబ సభ్యుల పేరుతో మళ్ళించి కొట్లాది రూపాయల అవినీతికి పాలడ్డారని గుర్తు చేస్తున్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా అక్కడ అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. విద్యా శాఖను ప్రక్షాళన చేయకుండా మరింతగా దిగజార్చే చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 30, 2026 4:33 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…