ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాబోతోన్న సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంతోష్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో ఈ రోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలోనే సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు రక్త కన్నీరు తెప్పించిన మొదటి దుర్మార్గుడు సంతోష్ రావేనని కవిత అరోపించారు. పార్టీకి, కేసీఆర్ కు ఉద్యమకారులను దూరం చేసిన మొదటి దెయ్యం కూడా ఆయనేనని ఆరోపణలు చేశారు.
గద్దర్ అన్నను గేటు దగ్గర నిలబెట్టినా, ఈటల రాజేందర్ వంటి ఉద్యమ నాయకులు బీఆర్ ఎస్ వీడినా అందుకు కారణం సంతోష్ రావేనని, ఆ పాపం ఊరికే పోదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారి అని, ఆయనతో సంతోష్ అంటకాగుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఫాం హౌస్ సమాచారాన్ని రేవంత్ రెడ్డికి సంతోష్ రావు అందిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ ఏం తిన్నా. ఏం చేసినా.. సగం ఇడ్లి తిన్నాడా.. మొత్తం ఇడ్లి తిన్నాడా అన్న విషయాలతో సహా సమాచారం ఇచ్చేది సంతోష్ రావేనని విమర్శించారు.
కాబట్టి సంతోష్ రావును రేవంత్ రెడ్డి శిక్షిస్తాడంటే తాను నమ్మడం లేదన్నారు. సంతోష్ రావు వంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారో అర్థం కావడం లేదని, చట్టం కరెక్టుగా పనిచేస్తే సంతోష్ రావుకు శిక్ష తప్పదని జోస్యం చెప్పారు.
This post was last modified on January 27, 2026 1:02 pm
బీఆర్ ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురై, బయటకు వచ్చి, ఆ పార్టీకి పూర్తిగా దూరమైన మాజీ ఎంపీ కవిత…
మొన్న పొంగల్ పండక్కు విడుదలైన కార్తీ వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్ని చవి చూసింది. జన నాయకుడు…
ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదని.. అమ్మాయిలు స్ట్రిక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా ఉంటే వారి జోలికి ఎవ్వరూ రారని ఇటీవల…
విజయ్ జన నాయకుడు కథ మళ్ళీ మొదటికే వచ్చింది. యు/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్న…
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దేవర విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ…