అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయా ? ఇదే అంశంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తుళ్ళూరులో జరిగిన కిసాన్ సదస్సులో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. రాజధానిగా అమరావతే ఉంటుందని రైతులతో మాట్లాడుతు వీర్రాజు ప్రకటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోందంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. పనిలోపనిగా తమకు అధికారం అప్పగిస్తే రూ. 5 వేల కోట్లతో రాజధానిని నిర్మించేస్తామని, రైతుల సమస్యలు పరిష్కరించేస్తామని..ఇలా చాలానే చెప్పారులేండి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే వీర్రాజు మొన్నటివరకు అమరావతికి వ్యతిరేకంగా ఇంతలా మాట్లాడింది లేదు. ఒకే సామాజివకర్గం కోసమే చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా చేసుకున్నారంటు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పైగా కేంద్రం ఇచ్చిన వేలాది కోట్లరూపాయల్లో చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగానే వీర్రాజు మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
విచిత్రమేమిటంటే రాష్ట్ర రాజధానుల నిర్ణయం అంశంతో కేంద్రానికి ఏమీ సంబంధం లేదని ఒకవైపు కేంద్రప్రభుత్వం పదే పదే అఫిడవిట్లు కోర్టుల్లో దాఖలు చేసింది. దాంతో కేంద్రం రాజధాని విషయంలో ఓ స్టాండ్ తీసుకున్నది కాబట్టి రాష్ట్రంలో బీజేపీ నేతలు కూడా ఈ విషయమై పెద్దగా స్పందించేవారు కారు. కాకపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయాన్ని తాము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేసేవారంతే. అలాంటది తాజాగా అమరావతికి మద్దతుగా వీర్రాజు ప్రకటన చేయటం అందులోను నరేంద్రమోడి ప్రతినిధిగా తానీ విషయం చెబుతున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే అమరావతికి మద్దతుగా టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన ప్రకటనలు చేస్తున్న విషయం చూస్తున్నదే.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మూడురోజులు తిరుపతిలోనే ఉన్న సోమువీర్రాజు అమరావతికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే అంతకుముందు ఉత్తరాధి పర్యటనలో గానీ లేకపోతే అనంతపురం జిల్లా పర్యటనలో కూడా ఏమీ మాట్లాడలేదు. అలాంటిది అమరావతికి రాగానే రాజదాని ప్రస్తావన తెచ్చారు. మరి మళ్ళీ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పర్యటించినపుడు ఈసారి ఏమి మాట్లాడుతారో చూడాల్సిందే. ఎందుకంటే ఇపుడు అమరావతిపై ఇంతటి స్పష్టమైన ప్రకటన చేసినాక పై ప్రాంతాల్లో పర్యటించినపుడు ఇదే ప్రస్తావనొస్తుంది కదా.
This post was last modified on December 15, 2020 4:59 pm
హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని…
సినిమాల మేకింగ్ ముచ్చట్లను రిలీజ్ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మామూలే. చాలా వరకు యూట్యూబ్లోనే అలాంటి వీడియోలు…
నిన్న రాత్రి హఠాత్తుగా దేశవ్యాప్తంగా ఉన్న పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో పుష్ప 2 ది రూల్ బుకింగ్స్ తీసేయడం సంచలనమయ్యింది.…
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…