Political News

దావోస్ టూర్‌: ఏపీకి పెట్టుబ‌డులు ఎన్ని?

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వ‌హించిన ప్ర‌పంచ ఆర్థిక ఫోరం స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్‌లు తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. నాలుగు రోజులు జ‌రిగిన ఈ స‌ద‌స్సులో భార‌త్ నుంచి మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ, అసోం, ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు.. మంత్రులు  కూడా హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ ప‌ర్య‌ట‌న‌పై భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు స‌హా.. దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు, సీఈవోల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తిలోని స్పోర్ట్స్ సిటీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ర‌త‌న్ టాటా సంస్థ అంగీక‌రించింది. విశాఖ‌లో పెట్టుబ‌డుల‌కు ముఖ్యంగా ఐటీ రంగంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ఇక‌, మంత్రి నారా లోకేష్ కూడా.. ప‌లు సంస్థ‌ల‌తో పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ఆయా సంస్థ‌లు వ‌చ్చేందుకు అంగీక‌రించాయి.

+ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్, జీసీసీ, వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు క్యాప్ జెమినీ సంస్థ అంగీక‌రించింది.

+ డిజిటల్ టాలెంట్ పైప్ లైన్ కో డెవలప్ మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌లు, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్ కోసం ఏపీ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ప‌నిచేసేందుకు ర‌తన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ముందుకు వ‌చ్చింది.

+ భారత్ లో ఏఐ, క్లౌడ్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడానికి 45 వేల మంది ఉద్యోగుల నియామక ప్రణాళిక రూపొందించినట్లు క్యాప్ జెమిని సీఈవో ఐమన్ ఎజ్జట్ తెలిపారు.

+ బ్లాక్ స్టోన్ సంస్థ‌ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా విశాఖపట్నంలో గ్రేడ్ ఎ ఆఫీస్ స్పేస్, ఇంటిగ్రేటెడ్ మిక్స్ డ్ యూజ్ డెవలప్ మెంట్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీక‌రించింది.

+ టెక్ మహీంద్ర సంస్థ‌.. విజయవాడలో టెక్ మహీంద్ర ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చింది. దీని వ‌ల్ల 6 వేల మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. విశాఖపట్నంలో డెలివరీ విస్తరణ పనులను వేగవంతం చేయ‌నుంది. వైజాగ్ లో టెక్ మహీంద్రా స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీంతో 3 వేల మందికి నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

This post was last modified on January 23, 2026 12:41 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Davos

Recent Posts

బాలయ్య కోసం కొత్త కథ రెడీ

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ స్పీడే వేరు. స్టార్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలి, ఏడాదికి ఒక్క చిత్రమైనా…

22 minutes ago

ఎల్లమ్మ ఆషామాషీగా ఉండదు

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ…

59 minutes ago

మిసెస్ చైతు ‘చీకటిలో’ వెలుగు ఉందా

అక్కినేని నాగచైతన్య భాగస్వామిగా తన జీవితంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ స్వతహాగా నటి అయినప్పటికీ తెరమీద రెగ్యులర్ గా…

1 hour ago

దురంధర్ 50 నాటౌట్… ట్రూ బ్లాక్ బస్టర్

ఒకప్పుడు సినిమాలు వంద రోజులు, సిల్వర్ జూబ్లీ ఆడితే బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడా అర్థం మారిపోయింది. మొదటి…

4 hours ago

‘బంగార్రాజు’ దర్శకుడు ఎక్కడ?

​టాలీవుడ్‌లో అనిల్ రావిపూడికి ఏ స్థాయిలో సంక్రాంతి సెంటిమెంట్, 100% స్ట్రైక్ రేట్ ఉందో, ఒకప్పుడు కళ్యాణ్ కృష్ణ కూరసాల…

4 hours ago

రిపబ్లిక్ డేని వాడుకుంటేనే రికార్డు వస్తుంది

మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి పండగ తర్వాత నెమ్మదించారు. సోమవారం నుంచి బుధవారం దాకా ఏపీలో పెంచిన టికెట్ రేట్లే…

4 hours ago