ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వచ్చే వారం ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదనపై కేంద్ర క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం పొందిన అనంతరం బిల్లును సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
2014 రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించగా, ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు స్వతంత్ర రాజధానిని అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమరావతిని రాజధానిగా ఖరారు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారిక నివేదికను సమర్పించింది.
రాజధాని ఎంపిక ప్రక్రియ, చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్మాణాల వివరాలను కూడా కేంద్రానికి వివరించింది. 2024 జూన్ 2 నుంచే అమరావతిని రాజధానిగా అమల్లోకి తీసుకురావాలని స్పష్టంగా విజ్ఞప్తి చేసింది.
ఈ ప్రతిపాదనపై కేంద్ర హోంశాఖ ఇప్పటికే వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను సేకరించింది. పట్టణాభివృద్ధి, న్యాయశాఖల అభిప్రాయాలు కూడా త్వరలోనే అందనున్నట్లు తెలుస్తోంది.
అన్ని శాఖల సూచనలు పూర్తైన తర్వాత క్యాబినెట్ నోట్ సిద్ధం చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతిపై ఉన్న అనిశ్చితికి తెరపడనుండగా, రైతులు, పెట్టుబడిదారులకు భరోసా కలిగి రాజధాని నిర్మాణాలు వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on January 21, 2026 6:22 pm
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.…
నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు…
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…