వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో-అప్ మీటింగ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయాలని కోరారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూల మద్దతు లభించింది.
ఈ హైటెక్ యుగంలో వ్యాపారానికి, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి దావోస్ లో సదస్సు సరిపోదని, మధ్యలో ఒకసారి…దాదాపు 6 నెలల తర్వాత మరో సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు.
దావోస్ లో వార్షిక, హైదరాబాద్ లో అర్ధ-వార్షిక సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని రేవంత్ చేసిన ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తలు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పెట్టుబడులు ఆకర్షించే కేంద్రంగా, మరో దావోస్ గా హైదరాబాద్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్, ఏఐ, లైఫ్ సైన్సెస్, ఇతర రంగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సీఈఓలతో భేటీ అవుతున్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 & ఏఐ హబ్ ఆవిష్కరణ వంటి అంశాలపై చర్చించారు.
This post was last modified on January 21, 2026 3:17 pm
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…