Political News

కాకినాడ‌కు భారీ ప్రాజెక్టు.. ఎన్ని వేల కోట్లో….

ఏపీ మంత్రి నారా లోకేష్‌.. శుక్ర‌వారం ఉద‌యం ఒక ట్వీట్ చేశారు. “ఈ రోజు సాయంత్రం అదిరిపోయే క‌బురు చెబుతాను రెడీగా ఉండండి“ అని ప్ర‌జ‌ల‌కు సూచించారు. అన్న‌ట్టుగానే ఆయ‌న తాజాగా శుక్ర‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కాకినాడ‌కు భారీ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు.

కాకినాడ‌లో భారీ పెట్టుబ‌డి రానున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఏకంగా 10 బిలియ‌న్ డాల‌ర్ల (రూ. 90,75,85,000,000) ప్రాజెక్టు త్వ‌ర‌లోనే కాకినాడ‌లో ఏర్పాటు కానున్న‌ట్టు ఆయ‌న వివ‌రించారు. ఇది కాకినాడ ముఖ చిత్రాన్ని మార్చే ప్ర‌య‌త్న‌మ‌ని పేర్కొన్నారు.

రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావాల‌న్న సంక‌ల్పంతో కూట‌మి ప్ర‌భుత్వంప‌నిచేస్తోంద‌ని నారా లోకేష్ తెలిపారు. త‌ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. ఇదేస‌మ‌యంలో ల‌క్ష‌లాది మంది నిరుద్యోగుల‌కు ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాల‌ను కూడా మెరుగు ప‌రుస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విశాఖ‌, తిరుప‌తి, క‌ర్నూలు, క‌డ‌ప జిల్లాలకు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌చ్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇప్పుడు తీర ప్రాంత జిల్లాగా ఉన్న కాకినాడ‌కు కూడా భారీ ప్రాజెక్టు వ‌స్తోంద‌న్నారు.

ఏఎం గ్రీన్ కంపెనీ కాకినాడ‌లో 10 బిలియన్‌ డాలర్ల(రూ. 90 వేల కోట్లు) పెట్టుబ‌డి పెట్ట‌నుంద‌ని మంత్రి నారా లోకేష్ ప్ర‌క‌టించారు. ఇది హ‌రిత అమ్మోనియాను ఉత్ప‌త్తి చేసే ప్రాజెక్టు అని.. రాబోయే రోజుల్లో ఇదే హ‌రిత ఇంధ‌నంగా వినియోగంలోకి రానుంద‌ని తెలిపారు.

ఏడాదికి 1.5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి చేయడంతోపాటు జర్మనీ, సింగపూర్‌, జపాన్‌కు ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయ‌డం ద్వారా స్థానికంగా ఉన్న 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివ‌రించారు.

అంతేకాదు.. కాకినాడ కేంద్రంగా దేశం నుంచి తొలిసారి గ్రీన్‌ అమ్మోనియా ఎగుమతి జ‌ర‌గ‌నుంద‌ని.. ఇది రాష్ట్రానికే కాకుండా.. ద‌క్షిణాదికే త‌ల‌మానికం కానుంద‌ని వివ‌రించారు.

This post was last modified on January 16, 2026 10:49 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

3 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

5 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 hours ago