భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్న ట్రంప్.. ఈ క్రమంలో మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా భారత్‌ను.. ముఖ్యంగా విశ్వగురువుగా పేరు తెచ్చుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆయన ఆత్మరక్షణలో పడేస్తున్నారు.
తాజాగా..
రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య మూడేళ్లుగా యుద్ధం సాగుతోంది. దీనిని నిలువరించి.. శాంతి దూతగా పేరు పొందాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇది సాధ్యం కావడం లేదు. దీనికి కారణం.. రష్యా వద్ద భారీ ఎత్తున ఆర్థిక వనరులు ఉండడమేనని ఆయన భావిస్తున్నారు. దీనికి భారత్, చైనాలు దోహదపడుతున్నాయని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్, చైనాలు.. డబ్బులు విరివిగా ఇస్తున్నాయన్నది ఆరోపణ.
ఈ క్రమంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి రష్యా నుంచి చమురుకొనుగోలు చేస్తే.. భారత్ వస్తువులపై దిగుమతి సుంకాన్ని(టారిఫ్) 50 శాతం కాదు.. ఏకంగా 500 శాతానికి పెంచుతామని హెచ్చరించారు. కేవలం దీంతోనే ఆయన సరిపుచ్చలేదు. దీనికి సంబందించి ఓ బిల్లును కూడా రెడీ చేశారు. దీనిని అమెరికా చట్టసభలో ఆమోదించాలన్నది ట్రంప్ ప్రయత్నం. ఆ వెంటనే అది అమల్లోకి వస్తుంది. చట్టసభలో ట్రంప్‌కు మద్దతు ఉన్న నేపథ్యంలో ఇది ఆమోదం పొందితే.. భారత్కు ఇబ్బందులు తప్పవు.
ఇక, రెండో విషయం.. భారత్ నేతృత్వంలోని సోలార్ పవర్ కూటమి దేశాల్లో అమెరికా కూడా ఉంది. తద్వారా పర్యవరణ పరిరక్షణకు సౌర విద్యుత్ను వినియోగించడం.. దీనిని ప్రమోట్ చేయడం లక్ష్యం. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. అయితే.. తాజాగా భారత్‌పై కోపంతో అమెరికా ఈ కూటమి నుంచి తప్పుకొంది. ఇది కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బందికరప రిణామంగా మారింది.
This post was last modified on January 8, 2026 3:26 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…