తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని హౌలా అని, ఆ హౌలాగాణ్ణి ఉరితీయాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్‌లో రైతులకు ఇచ్చిన హామీని మరిచిన రాహుల్ గాంధీని ఉరితీయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌ను ఉరి తీయాలా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిని ఉరితీయడం కాదని, ఆయనను ఇంకా చాలా చేయాలని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి లాగులో తొండలిడిచిపెడదాం అంటూ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శలు గుప్పించారు.
ఇక, తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరును కేటీఆర్ తప్పుబట్టారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అని విమర్శించారు. శాసనసభ బూతుల సభగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.
This post was last modified on January 6, 2026 6:41 pm
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను…
ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…