యువతలో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ హీరోగా అభిమానాన్ని సంపాదించుకున్న పవన్, అదే స్థాయిలో యువ రాజకీయ నేతగా కూడా యువత హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా తరలి వస్తూ తమ మద్దతును ప్రకటిస్తోంది. ఈ పరిణామం పవన్ రాజకీయ ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
యువత ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలను పవన్ కళ్యాణ్ స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని ఆయన ప్రసంగాలు చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా యువతను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ‘డబ్బున్న నాయకులు కాదు, దమ్మున్న యువత కావాలి’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ప్రేరణగా మారుతున్నాయి. రాజకీయ వ్యవస్థలో మార్పు యువత చేతుల్లోనే సాధ్యమన్న సంకేతాలను ఆయన తరచూ ఇస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌కు యువత అభిమానుల ఫాలోయింగ్‌కు ఎలాంటి కొదవ లేదని రాజకీయ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఆ అభిమానమే గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయంగా ఆయనకు కొంత మేరకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో తెలంగాణలోనూ జనసేన కీలక రాజకీయ శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో పవన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో పార్టీ నిర్మాణం పూర్తిగా యువతపై ఆధారపడి ఉంటుందని పవన్ భావిస్తున్నారు. ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ‘తెలంగాణలో పోరాట శక్తి ఉన్న యువతకు కొదవ లేదు. అలాంటి యువతకు జనసేన సిద్ధాంతాలు బలాన్నిస్తాయి. జనసైనికులు తెలంగాణ భవిష్యత్తు కావాలి’ అంటూ పిలుపునివ్వడం, అక్కడ బలమైన యువ నాయకత్వాన్ని నిర్మించాలన్న ఆయన ఆలోచనలకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on January 5, 2026 1:39 pm
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందని, నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు…
టీడీపీలో ఏం జరిగినా వార్తే.. విషయం ఏదైనా కూడా… నాయకుల మధ్య చర్చ జరగాల్సిందే. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో…
బాలీవుడ్ నుంచి హీరోయిన్లు దక్షిణాదికి దిగుమతి కావడం దశాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయమే. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీల్లో స్థానిక కథానాయికల కంటే నార్త్…