Political News

పవన్ 5 సార్లు సీఎం కావాలన్నదే ఆవిడ కోరిక

ఇప్పటం….జనసేన నేతలు, కార్యకర్తలకు ఈ పేరు బాగా గుర్తుంటుంది. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో ఆ గ్రామంపై అప్పటి వైసీపీ ప్రభుత్వం కక్షగట్టిందని ఆరోపణలు వచ్చాయి.

రోడ్డు విస్తరణ పేరు చెప్పి జనసేన కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేసి మరీ వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిందని జనసేన నేతలు ఆరోపించారు. అయితే, 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని, గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పటం రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు అప్పట్లో పవన్ కళ్యాణ్ కోరారు.

ఈ క్రమంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నేడు ఇప్పటంలో పవన్ పర్యటించారు. నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ వెళ్లారు. ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

నాగేశ్వరామ్మకు 50 వేల రూపాయలు, ఆమె మనవడి చదువు కోసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా ఆమె మనవడి చదువు కోసం ప్రతినెలా తన జీతం నుంచి 5 వేల రూపాయలు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే పవన్ తమ ఇంటికి రావడం పట్ల నాగేశ్వరమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఇంటికి పెద్దకొడుకులా వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని సంతోషించారు. ‘‘నువ్వు 5 సార్లు ముఖ్యమంత్రివి కావాలి…అది నేను చూడాలి…ఒకవేళ నేను చూడలేకపోయినా…నువ్వు 5 సార్లు సీఎం కావాలి’’ అని పవన్ తో నాగేశ్వరమ్మ అన్నారు. ఆ వ్యాఖ్యలకు పవన్ నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

This post was last modified on December 24, 2025 10:05 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan

Recent Posts

ఆ ‘స్పీడ్’ ఏంటి బాబు గారు?

టీడీపీ అధినేత. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 అంటూ…

51 minutes ago

ఎడారి దేశంలో మంచు… మనకి గండమా?

సౌదీ అరేబియా ఎడారిలో మంచు కురవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ వింటర్ లో ఉత్తర ప్రాంతంలోని…

5 hours ago

‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్

ఏడాది చివర్లో బాక్సాఫీస్ వేటకు వచ్చి, సంచలన వసూళ్లు సాధించిన ‘దురంధర్’ సినిమా.. 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డును సొంతం…

5 hours ago

క్రిస్మస్ క్లాష్ – అన్నీ మంచి శకునములే

ఏడాది చివరి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సందడిగా కనిపిస్తోంది. మాములుగా ఈ డేట్ లో…

11 hours ago

టాలీవుడ్ తెర ఎరుపెక్కుతోంది

తెలుగు సినిమా తెరమీద రక్తం పారుతోంది. ఒకప్పుడు హత్యలు లాంటి షాట్స్ చూపించేటప్పుడు వీలైనంత వయొలెన్స్ ఎక్స్ పోజ్ కాకుండా…

11 hours ago

పెద్ద ముప్పు తెచ్చి పెట్టనున్న దురంధర్ 2

నిన్నటిదాకా బాలీవుడ్ వర్గాల్లో వినిపించిన మాట దురంధర్ 2 విడుదల ముందు ప్రకటించినట్టు మార్చి 19 ఉండదని. కానీ ఇప్పుడు…

11 hours ago