Political News

పవన్ను ట్రాప్ లోకి లాగుతున్నారా ?

కమలంపార్టీ నేతల వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండ్ కో మధ్య పెద్ద భేటీనే జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్దితులు, నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతుల గురించి, రాష్ట్రంలో రోడ్ల దుస్ధితితో పాటు ఏలూరులో వింతరోగం తదితర అనేక అంశాలపై చర్చించిన నేతలు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల గురించి మాత్రం చర్చించకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో రెండు పార్టీల్లో దేనికదే రెడీ అయిపోతోంది. తమ అభ్యర్ధి పోటీ చేస్తేనే గెలుపు అవకాశం ఉంటుందంటే కాదు తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటు రెండుపార్టీల నేతల మద్య వాగ్వావాదం పెరిగిపోతోంది. దాంతో పోటీ విషయంలో ఇటు సోము వీర్రాజు, అటు పవన్ కల్యాణ్ ఇద్దరు పంతాలకు వెళ్ళిపోయారు.

మొన్న అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటీయే 2.28 లక్షలు. ఆయన హఠాన్మరణం కారణంగా ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 16 వేలు. జనసేన మద్దతుతో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధికి వచ్చింది 20 వేల ఓట్లు. అంటే రెండు పార్టీలకు కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదని అర్ధమైపోతోంది. ఇటువంటి ఓట్ బేస్ ఉన్న పార్టీలు కూడా గెలుపు మాదే అంటే మాదే అంటు టికెట్ కోసం పోటీ పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

సరే ప్రతి పార్టీ కూడా గెలుస్తామని చెబుతుందనటంలో సందేహం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ ప్రస్తావంచారట. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్ధి విషయంపై భేటీ అవుదామని వీర్రాజు విషయాన్ని దాటవేసినట్లు సమాచారం. ముందైతే ఏపార్టీ అభ్యర్ధి పోటీ చేసినా రెండోవాళ్ళు విజయం కోసం పనిచేయాలనే స్ధూలమైన నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్ధి విషయం మాట్లాడాలన్న వీర్రాజు వాదనే కరెక్టయితే మరి దాదాపు రెండు నెలల క్రితమే తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని ఎలా ప్రకటించారు ? ఆ తర్వాత కూడా ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారనే అర్ధం వచ్చేట్లుగా చాలా హడావుడే చేశారు. తీరా పోటీ చేసే అవకాశం తమకే కావాలని పవన్ పట్టుబట్టే సరికి నోటిఫికేషన్ తర్వాత భేటి అవుదామని విషయం దాటేసినట్లు కనబడుతోంది. మొత్తం మీద తిరుపతి సీటు కోసం పట్టుబట్టకుండా పవన్ కు బీజేపీ ట్రాప్ వేస్తున్నట్లే అనుమానంగా ఉంది. మరి గతంలో లాగ ట్రాపులో పడిపోతారా ? లేకపోతే మెలకువగా ఉంటారా చూడాలి.

This post was last modified on December 10, 2020 3:11 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

9 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

9 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

10 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

10 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

11 hours ago