వైసీపీ పరిస్థితి డోలామానంలో పడింది. పార్టీని ముందుకు నడిపించేవారు లేక, బలమైన గళాలు వినిపించే వారు కనిపించక, పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పార్టీ అధినేతను ఏమైనా అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ముందుకు వచ్చేవారు. దీటుగా కౌంటర్లు ఇచ్చేవారు.
అయితే గత ఏడాది కాలంగా వారు సైలెంట్ అవుతున్నారు. ఎక్కడ కేసులు పెడతారో అన్న భయం వెంటాడుతోందన్నది వాస్తవం.
ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు చేరువ అవుతున్న నేపథ్యంలో స్పీడు పెంచాలని ఇటీవలే జగన్ పార్టీ నాయకులకు హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే ఒకరిద్దరు బయటకు వస్తున్నారు. కానీ ఇంతలోనే ఇటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్, అటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో మళ్లీ గుబులు రేపుతున్నాయి. నోరు విప్పితే ఏం జరుగుతుందో అన్న బెంగ వారిని వెంటాడుతోంది.
రెడ్ బుక్‌లో మూడు పేజీలు మాత్రమే ఓపెన్ చేశామని, ఇంకా ఓపెన్ చేయని పేజీలు చాలానే ఉన్నాయని, ముహూర్తం పెడతానంటూ ఇటీవల రాజమండ్రిలో నారా లోకేష్ హెచ్చరించారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యే వైసీపీ నాయకులు తాజాగా ఎక్కడా స్పందించలేదు. లోకేష్‌ను కూడా ఎక్కడా కార్నర్ చేయలేదు.
ఇక పవన్ కళ్యాణ్ తాజాగా రౌడీయిజం, గూండాయిజం చేసేవారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపైనా నేరుగా నాయకులు స్పందించలేదు. ఒకరిద్దరు మాట్లాడినా గతంలో ఉన్న రేంజ్‌లో మాత్రం తమ వ్యాఖ్యలకు పదును పెట్టలేదు.
సో మొత్తంగా చూస్తే అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు డోలాయమానంలో పడ్డారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు అరెస్టయిన వారికి న్యాయం, సహాయం కూడా సరిగా అందించలేని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరికివారు “మనకెందుకులే” అని సరిపుచ్చుకుంటున్నారు.
మరి ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on December 22, 2025 10:55 am
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…