వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే, తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది.
విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. గత ఏడాది జులైలో వంశీతోపాటు ఆయన అనుచరులు తనను బెదిరించి దాడికి పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద వంశీతో సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
2023లో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. వంశీతో పాటు ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ దాడిలో అప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న సత్యవర్థన్ ఆ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నారు. హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆ కేసుకు కీలకంగా మారింది. దీంతో, సత్యవర్థన్ ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత హర్షవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
This post was last modified on December 18, 2025 2:45 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…