‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. బుధవారం ఏపీ సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పనితీరును సీఎం ప్రశంసించారు. పరిపాలన అనుభవం లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారంలో పవన్ చూపుతున్న చొరవ అభినందనీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ దిశగా పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని సీఎం తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ రోడ్ల నిర్మాణాల విషయంలో ఆయన తీసుకుంటున్న తక్షణ నిర్ణయాలను ఉదాహరణలతో వివరించారు. ఇటీవల అంధుల క్రికెట్ టోర్నీ విజేతలను అభినందించిన సందర్భంగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారిణి తమ గ్రామానికి రహదారి వేయాలని కోరగానే వెంటనే నిధులు మంజూరు చేయడం పవన్ స్పందనకు నిదర్శనమని చెప్పారు. ఇదే తరహాలో మరో సంఘటనను కూడా కలెక్టర్ల సమక్షంలో ప్రస్తావించారు.
మంగళవారం కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసిన సందర్భంగా అల్లూరి జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడు తమ గ్రామానికి రహదారి కావాలని కోరగా, ఆ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మీటింగ్ ముగిసేలోగా రూ.3.5 కోట్ల నిధులు మంజూరు చేయించిన విధానాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. బాధ్యత గల ప్రభుత్వం అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రజల అవసరాలకు సద్వినియోగం చేయాలన్నదే తమ పాలన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
This post was last modified on December 18, 2025 9:09 am
స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…
ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…