Political News

మాకు మీరు ఓటేయ‌లేదు… డ‌బ్బులు తిరిగివ్వండి!

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్.. దీనికి ముందు జ‌రిగిన ప్ర‌చారం.. ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు అభ్య‌ర్థులు పంచిన న‌గ‌దు.. వంటివి కీల‌క మ‌లుపు తిరిగాయి. కొంద‌రు అభ్య‌ర్థులు.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ఓటుకు నోటు పంపిణీ చేశారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు కూడా ధ్రువీక‌రించారు. న‌గ‌దు పంపిణీని పూర్తిగాని లువ‌రించ‌లేక పోయామ‌నికూడా ఒప్పుకొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. 8.9 కోట్ల రూపాయ‌ల‌ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే.. తొలి విడ‌త ఎన్నిక‌ల పోలింగ్‌, కౌంటింగ్ కూడా పూర్త‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో ఆయా పంచాయ‌తీల్లో గెలిచిన వారి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఓడిన వారు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. ఇంటింటికీ వెళ్లి.. “మీరు మాకు ఓటేయ‌లేదు. మేం ఇచ్చిన సొమ్మును మాకు తిరిగి ఇవ్వండి“ అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం వివాదాల‌కు, ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారి తీసింది. కొంద‌రు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల్లో న‌గ‌దు పంచ‌డం అనేది నేరం. పైగా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు కూడా సాధార‌ణ ఎన్నిక‌ల మాదిరిగా న‌గ‌దు పంపిణీ చేశారు. ఓటుకు 500 చొప్పున ఇచ్చిన వారు కూడా ఉన్నారు.

మ‌రికొంద‌రు.. కుటుంబంలో ఎంత‌మంది ఉన్నా.. ఒక్కొక్క ఇంటికీ రూ.1000-1500 వ‌ర‌కు పంచారు. కానీ, ఇలా పంచిన వారు కొన్ని చోట్ల ఓడిపోయారు. దీంతో వారంతా ఇప్పుడు ఓట‌ర్ల ఇళ్ల‌కు వెళ్లి త‌మ సొమ్మును తిరిగి ఇవ్వాల‌ని కోరుతున్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని సోమ్లాతండాలో ఎమ్మెల్యే ముర‌ళీ నాయ‌క్ సోద‌రుడి భార్య‌ పంచాయ‌తీ స‌ర్పంచ్‌గా పోటీ చేశారు. ఈమె త‌న‌కున్న ఆర్థిక బ‌లంతో న‌గ‌దు పంపిణీ చేశారు. కానీ, ఓడిపోయారు. దీంతో ఇంటింటికీ వెళ్లి త‌న‌కు సొమ్ము తిరిగి ఇచ్చేయాల‌ని కోరారు. లేక‌పోతే.. త‌న‌కే ఓటే వేసిన‌ట్టు దేవుడిపై ప్ర‌మాణం చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఇక‌, వ‌ర్ధ‌న్న‌పేటలో మరో అభ్య‌ర్థి.. తాను 600 మందికి డ‌బ్బులు పంచాన‌ని, కానీ, త‌న‌కు 55 ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయ‌ని.. మిగిలి 545 మంది త‌న‌కు సొమ్ము తిరిగి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇవ్వ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు కూడా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు ఓట‌ర్లు కూడా.. అభ్య‌ర్థుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. “మీరు ఇస్తేనే మేం తీసుకున్నా.. మా అంత‌ట మేమొచ్చి మిమ్మ‌ల్ని డ‌బ్బులు అడిగామా?“ అని ప్ర‌శ్నించారు.

This post was last modified on December 12, 2025 9:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌).. ఈ పేరుకు పెద్ద ప్రాభ‌వమే ఉంది. ఒక్కొక్క‌పార్టీకి నాయ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…

2 hours ago

కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో..…

2 hours ago

బాబుతో `క‌లిసి` వెళ్ల‌డం వెనుక మోడీ వ్యూహం ఇదేనా?!

``ఫ‌లానా వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయండి.. ఫ‌లానా పార్టీతో చేతులు క‌ల‌పండి!`` అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న రాజ‌కీయ జీవితంలో…

5 hours ago

రాధికా డబుల్ స్టాండర్డ్స్… నెటిజెన్ల పంచులు

కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…

6 hours ago

వారికి వ్యక్తిగతంగా 84 లక్షలు అందజేసిన పవన్

ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…

7 hours ago

ఏజ్ గ్యాప్… నో ప్రాబ్లం అంటున్న రకుల్

తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…

8 hours ago