తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం, బెనిఫిట్ షోలు వేయడం గురించి ఏడాది కిందట్నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పాటు ఏ ఇబ్బందీ లేకుండా వీటికి అనుమతులు వచ్చేశాయి. కానీ ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో చోటు చేసుకున్న విషాదం వల్ల.. చాలా రోజుల పాటు బెనిఫిట్ షోలు ఆగిపోయాయి. అదనపు రేట్లూ ఇవ్వలేదు.
కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు మాత్రం ఈ ఆఫర్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ ‘ఓజీ’కి టికెట్ల రేట్ల పెంపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు పడడం.. ఈ జీవోలు చెల్లవని కోర్టు ఆదేశాలివ్వడం ఇండస్ట్రీకి ఇబ్బందిగా మారింది. ఆ టైంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఇకపై రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. కానీ తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’కు మళ్లీ రేట్లు పెంచారు. బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చారు.
కానీ దీని మీద మళ్లీ ఒక వ్యక్తి కోర్టుకెక్కారు. రేట్ల పెంపు చెల్లదని సింగిల్ డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఐతే వెంటనే నిర్మాతలు దీనిపై అప్పీల్ చేయడంతో కోర్టు దీనిపై స్టే ఇచ్చింది. ఈ నెల 14 వరకు రేట్ల పెంపు కొనసాగనుంది. 15న దీనిపై మళ్లీ విచారణ చేయనున్నారు. అప్పుడు రేట్ల పెంపును ఆపే అవకాశాలు లేకపోలేదు. ఐతే ప్రతిసారీ ఇలా కోర్టు కేసులు పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం ఇకపై రేట్ల పెంపు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చేలా కనిపిస్తోంది.
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మరోసారి ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఇకపై ఏ సినిమాకూ టికెట్ల ధరలు పెంచమని ఆయన స్పష్టం చేశారు. ఈసారికి పొరపాటు జరిగిందని.. ఇకపై ఇలా ఉండదని ఆయనన్నారు. హీరోలకు వంద కోట్ల పారితోషకం ఎవరు ఇవ్వమన్నారని.. అందువల్లే బడ్జెట్లు పెరుగుతున్నాయని.. దీంతో టికెట్ల ధరలు పెంచి ప్రేక్షకుల మీద భారం మోపుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రేక్షకులకు టికెట్ల ధరలు అందుబాటులో ఉండాలన్నదే తమ ఉద్దేశమని.. అందుకే ఇకపై రేట్ల పెంపు ఉండదని ఆయన తేల్చి చెప్పారు.
This post was last modified on December 12, 2025 6:18 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…