బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై మంత్రి కొండా సురేఖ కొద్ది నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, కొండా సురేఖపై కేటీఆర్, నాగార్జున పరువు నష్టం దావా వేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో నాగార్జున ఆ కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ, కేటీఆర్ పై మాత్రం న్యాయపోరాటం చేస్తానని సురేఖ అన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో కొండా సురేఖకు భారీ షాక్ తగిలింది.
కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేటీఆర్ వేసిన కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా విచారణకు కొండా సురేఖ హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. కాగా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన క్రమంలో కొండా సురేఖను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి, మంత్రి హోదాలో ఉన్న సురేఖ ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ పై న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోతారు అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on December 11, 2025 10:05 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…