జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది. అభిమానులు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కనివిని ఎరుగని రీతీలో సంబరాలు జరుపుకున్నారు. ఉదయం షోలు ఆరు గంటల నుంచి మొదలుపెట్టినా అర్ధరాత్రి నుంచే హాళ్ల దగ్గర పడిగాపులు పడిన వైనం కనిపించింది. స్వంత ఫ్యాన్ ని హత్య చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ కు మద్దతుగా రిషబ్ శెట్టి, శివ రాజ్ కుమార్ లాంటి సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్పడం చర్చకు దారి తీసింది. ఇంత హల్చల్ చేసిన డెవిల్ కు అసలు ఎలాంటి టాక్ ఉంది, అంతగా ఏముందో ఓ లుక్ వేద్దాం.
ఇది డ్యూయల్ రోల్ హీరో కథ. కృష్ణ (దర్శన్) అనే మెస్ నడుపుకునే యువకుడికి సినిమా నటుడు కావాలని లక్ష్యంగా ఉంటుంది. స్టార్లను ఇమిటేట్ చేస్తూ ఎప్పటికైనా తన కటవుట్ థియేటర్ల ముందు ఉండాలని కలలు కంటూ ఉంటాడు. అవినీతికి మారుపేరుగా నిలిచిన ముఖ్యమంత్రి కొడుకు ధనుష్ (దర్శన్) అలియాస్ డెవిల్ పరమ దుర్మార్గుడు. డ్రగ్స్, హత్యలు, మాఫియా ఇవే ప్రపంచంగా ఉంటాడు. ఒక కుట్రలో భాగంగా అమాయకుడైన కృష్ణ డెవిల్ స్థానంలోకి వస్తాడు. హీరోయిన్ వల్ల ఈ నిజం బయటపడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు, సిఎం డమ్మీ వారసుడిగా కృష్ణ ఏం చేశాడనేది అసలు స్టోరీ.
దర్శకుడు ప్రకాష్ వీర్ చాలా రొటీన్ టెంప్లెట్ ఫాలో అయ్యాడు. హీరో విలన్ రెండూ ఒకరే చేయడం కొత్తేమి కాదు. గతంలో శోభన్ బాబు, కృష్ణ, బాలకృష్ణ, అజిత్, ఆ మధ్య గోట్ లో విజయ్ ఇలా అందరూ ట్రై చేశారు. ఈసారి దర్శన్ వంతు వచ్చింది. రొటీన్ మాస్ గా అనిపించే డెవిల్ లో ఎలాంటి ప్రత్యేకత లేదు. కేవలం దర్శన్ కోసం మిగిలిన ఎలిమెంట్స్ ఎలా ఉన్నా ఓపికతో భరిస్తామంటే ట్రై చేయొచ్చు కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం ఇదో అంతులేని ప్రహసనంలా అనిపిస్తుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం కూడా అంతంత మాత్రమే. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వొచ్చేమో కానీ కంటెంట్ పరంగా డెవిల్ చాలా బలహీనంగా ఉన్నాడు.
This post was last modified on December 11, 2025 4:59 pm
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…
పార్టీ మెప్పు కోసమో.. తమ ప్రాపకం కోసమో.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తెగ రెచ్చిపోతుంటారు. వేదిక దొరికితే చాలు…