అయిన కాడికీ.. కాని కాడికీ.. రాజకీయాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్యలా మారింది. ఇప్పటికే గత ఎన్నికల్లో చావు దెబ్బ తిని.. 11 స్థానాలకు పరిమితమై.. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి.. అలో లక్ష్మణా అంటూ.. ప్రతిపక్ష హోదా కోసం..కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితిని తెచ్చుకున్నా.. ఇంకా మార్పు అయితే.. కనిపించడం లేదు. 2024 ఎన్నికలకు ముందు ఎలా అయితే.. ఆ పార్టీ నాయకులు బిహేవ్ చేశారో.. అలానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ప్రజల ఓటు బ్యాంకు కేవలం సంక్షేమంతోను.. ప్రభుత్వాలు ఇచ్చే నగదుతోను.. ముడి పడి లేదన్న విషయాన్ని ఏపీ ప్రజలు రెండు సార్లు నిరూపించారు. ఇదే నిజమైతే.. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు.. పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు రూ.10 వేల చొప్పు బ్యాంకుల్లో వేశారు. కానీ, ఆయన గెలిచారా? లేదే..!. ఇక, 2019-24 వరకు తాను 2.5 లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కి బ్యాంకుల్లోవేశానని చెప్పిన జగన్‌ను మాత్రం కరుణించారా? లేదే!!.
దీనికి కారణం.. ప్రజల సెంటిమెంటుతో ముడిపడిన వ్యవహారాలే!. ఈ విషయాన్ని వైసీపీ గాలికి వదిలేసింది. 2019 ముందు.. జగన్ చేసిన పాదయాత్ర సెంటిమెంటును రగిల్చితే.. 2024లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా అవమానించడం.. మూడు పెళ్లిళ్లు అంటూ.. వికృత ప్రచారం చేయడం.. కాపులను అవమానించే(టీడీపీని భుజాన మోస్తున్నారంటూ) వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీపైనా.. పవన్ పైనా సెంటిమెంటు ఏర్పడి.. కూటమికి జై కొట్టారు.
ఈ విషయం తెలిసి కూడా.. వైసీపీ మళ్లీ అవే తప్పులు చేస్తోంది. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది. ఇటీవల కర్ణాటకలో పర్యటించిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు.. దీనికి ముందు పీటీఎం కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన భేటీ అయిన విషయాన్ని గుది గుచ్చి వికృత ప్రచారం చేసి ఆనందిస్తోంది. కానీ, ఇది ఆ పార్టీకి ఆనందంగా ఉండొచ్చు. అయితే.. పవన్‌ను అభిమానించేవారు.. ముఖ్యంగా కాపులకు మద్దతుగా నిలిచేవారిలో ఆగ్రహాన్ని కల్పిస్తోంది. సో.. దీంతో వైసీపీ ప్రత్యేకంగా బావుకునేది ఏమీ లేకపోగా.. ఇంకా ఆ పార్టీ డైల్యూట్ అవుతుందన్న విషయాన్ని మరిచిపోవడం గమనార్హం.
This post was last modified on December 11, 2025 8:08 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…