Political News

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని స‌రిచేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెబుతున్నా.. ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌రకు అడుగులు వేయ‌డం లేదు. తాజాగా పార్ల‌మెంటులో కీల‌క చ‌ర్చ జ‌రిగింది. అది కూడా కాంగ్రెస్ పార్టీని, తొలి ప్ర‌ధాని నెహ్రూను త‌ప్పుబ‌డుతూ.. చేప‌ట్టిన వందేమాత‌రం చ‌ర్చ‌ను దేశ‌వ్యాప్తంగా కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌ను త‌ర‌చుగా ఎక్కువ మంది వీక్షిస్తున్నారు. సోమ‌వారం జ‌రిగిన వందేమాత‌రంపై చ‌ర్చ‌ను మ‌రింత ఎక్కువ మంది వీక్షించారు.

ఈ చ‌ర్చ‌ను తొలుత ప్ర‌ధాని మోడీ ప్రారంభించారు. సుదీర్ఘంగా ఆయ‌న 45 నిమిషాల పాటు ప్ర‌సంగించారు. మ‌ధ్య‌లో కొన్ని క‌వితలు కూడా చ‌దివారు. మ‌రికొన్ని చ‌లోక్తులు కూడా విసిరారు. అదేస‌మ‌యంలో వేదాలు..రామాయ‌ణాన్ని, లంకా న‌గ‌రాన్ని కూడా స్పృశించారు. ఇలా.. ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం జోరుగా సాగింది. దీనిలోనే ఆయ‌న‌.. మాజీ ప్ర‌ధానులు నెహ్రూ.. ఇందిరా గాంధీ లపై విమ‌ర్శ‌లు గుప్పించారు. మొత్తంగా ప్ర‌ధాని ప్ర‌సంగం జోరుగానే సాగింది. త‌దుప‌రి వ‌రుసలో ప్ర‌ధాని త‌ర్వాత‌.. ప్ర‌సంగించాల్సిన విప‌క్ష నాయ‌కుడు రాహుల్‌గాంధీకి అవ‌కాశం వ‌చ్చింది. కానీ, ఈ కీల‌క చ‌ర్చ‌కు రాహుల్‌గాంధీ డుమ్మా కొట్టారు.

పోనీ.. గాంధీల కుటుంబం నుంచి ఎవ‌రైనా పాల్గొన్నారా? అంటే.. రాహుల్‌గాంధీ, ఆయ‌న సోద‌రి ప్రియాంక గాంధీలు.. మాత్ర‌మే లోక్‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. సోనియా గాంధీ రాజ్య‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. రాజ్య‌స‌భ‌లో వందేమాత‌రంపై చ‌ర్చ మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. దీంతో లోక్‌స‌భ‌లో మోడీ ప్ర‌సంగించిన త‌ర్వాత‌.. రాహుల్ లేదా, ప్రియాంక గాంధీలు ప్ర‌సంగిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ.. ఇరువురు కూడా స‌భ‌కు డుమ్మా కొట్టారు. ఈ విష‌యం రాజ‌కీయంగా బీజేపీకి మ‌రో అస్త్రాన్ని అందించిన‌ట్టు అయింది. “వందేమాత‌రానికి నెహ్రూ, ఇందిర‌లే కాదు.. రాహుల్ కూడా ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలుస్తోంది“ అంటూ. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిరెణ్ రిజుజు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తానికి కీల‌క స‌మ‌యాల్లో రాహుల్ గాంధీ త‌ప్పుల‌పై త‌ప్పులు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 9, 2025 7:25 am

Share
Show comments
Published by
Kumar
Tags: Rahul Gandhi

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

52 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago