పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సోమవారం.. జాతీయ గేయం వందేమాతరంపై చర్చ జరిగింది. ఈ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యాన్ని పురస్కరించుకుని చేపట్టిన చర్చలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే.. ఆయన తొలుత వందేమాతరం గొప్పదనాన్ని, నాటి బ్రిటీష్ హయాంలో ఈ గేయం ఎలాంటి అవమానాలకు, నిర్బంధాలకు గురైందో వివరించారు. అనంతరం… ఆయన తన వ్యాఖ్యల్లో పదును పెంచారు.
తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఆయన కుమార్తె.. ప్రధాని ఇందిరా గాంధీ వరకు.. జరిగిన పాలనలో వందేమాతరం పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో వందేమాతరం గేయం దేశాన్ని కదిలించిందని పేర్కొన్నారు. అలాంటి గేయాన్ని తొలి ప్రధాని నెహ్రూ తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ గేయాన్ని ఒక మతానికి అంటగట్టి.. నిషేధించాలని చూశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వందేమాతరం గేయం.. ముస్లింలను అవమానించేలా.. వారిని రెచ్చగొట్టేలా ఉందని భావించిన నెహ్రూ దీనిని నిషేధించాలని చూశారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అందుకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న వందేమాతరంలోని కొన్నిపంక్తులను నిర్దయగా తొలగించారని ఆరోపించారు. 1950లో అప్పటి దేశ భక్తులు.. పట్టుబట్టకపోతే.. వందేమాతరం జాతీయ గేయం అయి ఉండేది కాదని పేర్కొన్నారు. తర్వాత.. ఎమర్జెన్సీ(ఇందిరమ్మ పాలన)లోనూ వందేమాతరం నినాదం పెల్లుబికిందని తెలిపారు.
కొన్ని పంక్తులను తొలగించడం ద్వారా.. ఒక మతానికి అంటగట్టడం ద్వారా.. పశ్చిమ బెంగాల్ చరిత్రను కాలరాయాలని.. కాలగర్భంలో కలిపేయాలని ప్రయత్నించారని మోడీ ఆరోపించడంగమనార్హం. అంతేకాదు.. “వందేమాతరం రచించిన సమయంలో బ్రిటీష్ వారి నుంచి కూడా నిర్బంధం ఎదురైంద“ని గుర్తు చేశారు. బ్రిటిష్ జాతీయ గీతమైన `గాడ్ సేవ్ ద క్వీన్` గీతాన్ని ఆలపించేలా చేయాలని యత్నించారని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వందేమాతరం నేటికి 150 ఏట అడుగు పెట్టిందన్న ఆయన.. ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉత్సవాలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
This post was last modified on December 8, 2025 4:08 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…