వైసీపీ వాళ్లు ఇక మూడు రాజధానుల మాటెత్తరేమో..? తమ కొంప ముంచిన ఆ విధానంపై ఇక మాట్లాడరేమో..? ఆ పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసి, కాలం వెళ్లదీసిన వైసీపీ అధినేత జగన్కు కూడా ఆ మాట ఎత్తక పోవడం అదే సమాధానంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు రాజధానిలో ఇల్లు కట్టుకుని ఉంటానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో అమరావతిపై అక్కసు పెంచుకున్నారు. మూడు రాజధానులు తమ విధానం అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
అమరావతిని పాలన రాజధానిగా, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని అన్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. అమరావతిలో ఉవ్వెత్తున నిరసనలు ఎగిసిపడ్డాయి. దానికి పోటీగా వైసీపీ అనుకూలురు సైతం మూడు రాజధానుల పేరిట శిబిరాలు ఏర్పాటు చేశారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ఓటమికి మూడు రాజధానుల అశం కూడా ఒక కారణం అని భావిస్తున్నారు. నిన్నటి విలేకరుల సమావేశంలో మూడు రాజధానుల అంశంపై ఓ విలేకరి జగనను ప్రశ్నించారు. దానికి ఆన్సర్చెప్పకుండా ఇప్పటికే టైం అయిపోయిందంటూ జగన్దాటవేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని పునర్మిర్మించడానికి కంకణం కట్టుకుంది. దీనికి అటు కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం లభిస్తోంది. దీంతో కొద్ది కాలంలోనే రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నిధులు కూడా సమకూరుతున్నాయి. ఇదంతా వైసీపీకి మింగుడు పడకుండా ఉంది. స్పష్టం చెప్పకపోయినా మూడు రాజధానుల అంశం ఇక ముగిసిపోయిన అధ్యాయం అనే భావిస్తున్నట్లు ఉంది.
అమరావతిని ఒకప్పుడు శ్మశానం అని అన్న వైసీపీ సీనియర్నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సైతం మాట మార్చారు. ప్రస్తుతానికి త్రీ క్యాపిటెల్పై నోరెత్తడం లేదు. ప్రస్తుతానికి రాజధాని అమరావతే అంటూ శాసన మండలిలో ప్రకటించారు. గతంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించిన వైసీపీ ఇప్పుడు దానిపై మౌనం వహిస్తోంది. గత ఎన్నికల్లో తమకు జరిగిన డ్యామేజిని గుర్తు చేసుకుని ఇకపై ఆ ఊసు ఎత్తదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
మూడు రాజధానులు ఒక ఫైయిల్యూర్ నిర్ణయం అని వైసీపీ కూడా భావిస్తున్నట్లుగా ఉంది. మరోవైపు దూసుకుపోతున్న అమరావతిపై కూడా ఏం మాట్లాడాలో.. ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని స్థితిలో ఉంది. ఒకప్పుడు అమరావతి ఉద్యమాన్ని అణిచివేసిన వైసీపీ ఇప్పుడు రాజధాని రైతుల రిటర్నబుల్ప్లాట్ల గురించి మాట్లాడడడం.. హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. రాజధాని అంశంపై వైసీపీ ఇప్పటికీ.. ఎప్పటికీ డైలమాలో ఉండడం ఆ పార్టీ ఎంతో కొంత నష్టం చేకూర్చే అంశమే…!
This post was last modified on December 5, 2025 12:53 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…