తెలుగు రాష్ట్రంలో మరో చెల్లి తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెట్టింది. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖ లో రంగ నాడు పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఈ రోజు ప్రకటించింది. ఆమె కొద్దిరోజుల కిందట సడన్ గా తెరపైకి వచ్చింది. ప్రజాజీవితంలో వసున్నట్టు ఆ రోజు ప్రకటించింది. రాజకీయ ఎంట్రీపై తర్వాత స్పందిస్తానన్న అప్పుడే చెప్పింది. సోదరుడు రాధాతో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించింది. మరోసారి అదే పునరుద్ఘాటించింది. మా అన్న వంగవీటి రాధాకృష్ణ తో ఎటువంటి విభేదాలు లేవు.. అనవసరంగా గాసిప్స్ ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాధా రంగ మిత్ర మండలి సభ్యులును చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. డిసెంబరు 26న విశాఖలో రంగా నాడు పేరు తో సభ పెట్టాం.. రంగా అభిమానులు కోసం నిర్వహించే సభ … అన్ని పార్టీ ల్లో ఉన్న అభిమానులు రావాలి అని పిలుపునిచ్చారు. తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏ పార్టీ తో ఇప్పుడు నాకు సంబంధం లేదని తెలిపారు. నా రాజకీయ నిర్ణయం ఏమైనా ఉంటే తరువాత చెబుతాను అన్నారు. నేను రేపు ఎటువంటి రాజకీయ ప్రకటన చేయడం లేదు, ఏ పార్టీ లో చేరడం లేదంటూ స్పష్టం చేశారు. రేపు విశాఖలో జరిగే సభకు వంగవీటి రాధాకృష్ణను ఆహ్వానించారు. అయితే ఆయన వస్తారో లేదో చూడాలి మరి…!
This post was last modified on December 4, 2025 11:30 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…