అమ (రావతి) రులైన రైతులకు నివాళి

అమరులైన అమరావతి రైతులను ఆదుకోవటానికి అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని అశ్విన్ అట్లూరి మిత్రబృందం రామారావు కాజా ద్వారా 15 లక్షల ఆర్థిక సహాయం డిసెంబర్ 6 న ఉదయం 10 గంటలకు అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో అమరులైన రైతు కుటుంబాలకు అందజేశారు.

ఉన్న ఎకరం ఊడ్చి ఇచ్చి ఉద్యమానికి ఊపిరిచ్చి శరీరాన్ని భూమికిచ్చి కుటుంబానికి మాత్రం కోత మిగిల్చి మనకి మాత్రం జవాబు లేని ప్రశ్ననిచ్చి జీవితాల్ని త్యాగం చేసిన అమరావతి రైతుల కుటుంబాల గాయాల్ని మాన్పలేకపోయిన బాధల్ని తీర్చలేకపోయినా…కలిసి వారి కన్నీరు తుడిసి మేమున్నాం అనే ధైర్యం నింపటానికి డిసెంబర్ 6 న అమరావతి లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా త్రికరణశుద్ధిగా మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి చనిపోయిన రైతు కుటుంబాల్ని ఓదార్చి వారికి ధైర్యాన్నిచ్చి మా ఈ సహాయాన్ని గౌరవించిన పెద్దలకు రైతు JAC నాయకులకు అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు అని అశ్విన్ అట్లూరి మిత్రబృందం తెలియజేసారు.

CLICK HERE!! for Images.

Press release by: Indian Clicks, LLC