ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతి రాజధానిపై వైసీపీ నేతలు చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. అమరావతిని శ్మశానంతో పోల్చడం మొదలు అమరావతిని అడవిలా మార్చడం వరకు వైసీపీ నేతలు చేయాల్సిందంతా చేశారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు కలకు వైసీపీ నేతలు తూట్లు పొడిచారు. అధికారం పోయినా సరే..ఇప్పటికీ అమరావతిపై విషం చిమ్మడం మాత్రం మానడం లేదు. అసలు ఏపీకి ప్రపంచస్థాయి రాజధాని ఎందుకని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
పార్టీలు, రాజకీయాలు పక్కనబెడితే…ఒక సగటు ఆంధ్రా పౌరుడిగా తమ రాష్ట్ర రాజధాని ప్రపంచ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కోరుకోవాలి కూడా. కానీ, వైసీపీ నేత అంబటి రాంబాబు మాత్రం అలా అనుకోవడం లేదు. అసలు ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ఓ అంతులేని కథ అంటూ అంబటి వెటకారలంగా మాట్లాడారు. రెండో దశ భూసేకరణ చేపట్టేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అంబటి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడిన వైసీపీకి ప్రజలు 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, అయినా సరే అమరావతి రాజధానిపై వైసీపీ బురదజల్లడం మానలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అమరావతి రాజధాని పూర్తయితే వైసీపీకి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని, అందుకే ఇలా పసలేని వ్యాఖ్యలతో అమరావతి ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓ పక్క రైతులు సంతోషంగా తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే అంబటి మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్నారని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates