వెండితెరపై ఎంతోమంది విలన్లను మట్టికరిపించిన ‘హీ మ్యాన్’ ధర్మేంద్ర, రాజకీయాల్లో మాత్రం ఆ స్థాయి మ్యాజిక్ చేయలేకపోయారు. 89 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఈ లెజెండ్, ఒకానొక సమయంలో ప్రపంచంలోని అందగాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్‌తోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కానీ, అది తనకు సెట్ అవ్వదని త్వరగానే తెలుసుకున్నారు. ఆయన రాజకీయ ప్రయాణం చిన్నదే అయినా, అది కాంట్రవర్సీలతోనే సాగింది.
ధర్మేంద్ర పొలిటికల్ ఎంట్రీ 2004లో జరిగింది. బీజేపీ ఆయనకు రాజస్థాన్‌లోని బికనీర్ టికెట్ ఇచ్చింది. అప్పటికే అక్కడ రెండుసార్లు కాంగ్రెస్ గెలిచి ఉంది. కానీ, ధర్మేంద్ర సినిమా గ్లామర్ ముందు అవేవీ పనిచేయలేదు. ఎల్కే అద్వానీ లాంటి దిగ్గజాలు ప్రచారం చేయడం, ధర్మేంద్ర ఛరిష్మా తోడవడంతో దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. అక్కడి వరకు సీన్ బాగానే ఉంది.
కానీ అసలు సినిమా పార్లమెంట్‌లో మొదలైంది. ఎంపీగా గెలిచినా, ధర్మేంద్ర మనసు సినిమాల మీద నుంచి మళ్లలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఆయన షూటింగ్స్‌లో బిజీగా ఉండేవారు. దీంతో ఆయన హాజరు శాతం దారుణంగా పడిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు ఆయన్ను టార్గెట్ చేశాయి. నియోజకవర్గ ప్రజలు కూడా తమ ఎంపీ కనిపించడం లేదని ఫిర్యాదులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. అయితే, కొందరు మాత్రం ఆయన తెరవెనుక నియోజకవర్గానికి చాలా చేశారని అంటారు.
ఐదేళ్ల పదవీకాలం ముగిశాక, ధర్మేంద్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. “మళ్లీ రాజకీయాల వైపు చూడను” అని శపథం చేశారు. ఆయన కొడుకు సన్నీ డియోల్ కూడా తర్వాత ఒకసారి మాట్లాడుతూ, “మా నాన్నకు పాలిటిక్స్ అస్సలు నచ్చలేదు, అందులో చేరినందుకు ఆయన రిగ్రెట్ అయ్యారు” అని చెప్పారు. ప్రచారంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ కూడా అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.
విచిత్రం ఏంటంటే, తండ్రి బాటలోనే కొడుకు సన్నీ డియోల్ కూడా బీజేపీలో చేరి గురుదాస్‌పూర్ ఎంపీ అయ్యారు. కానీ తండ్రిలాగే కొడుకు కూడా పార్లమెంట్‌కు డుమ్మా కొట్టారు. ఒక దశలో ఆయన అటెండెన్స్ కేవలం 18 శాతమే ఉంది. చివరికి తండ్రిలాగే సన్నీ కూడా ఒక్క టర్మ్‌తో పాలిటిక్స్‌కు ప్యాకప్ చెప్పేశారు. కానీ, ధర్మేంద్ర భార్య హేమమాలిని మాత్రం మథుర నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్‌గా నిలిచారు.
This post was last modified on November 24, 2025 4:24 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…