రెండు కీలకమైన ఎస్సీ నియోజకవర్గాల్లో టిడిపికి తీవ్ర ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేపదే ఆయా నియోజకవర్గాల నుంచి వివాదాలు విమర్శలు కూడా తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేది పార్టీ అధిష్టానం తీవ్రంగా చర్చిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని సమూలంగా మార్చడంతో పాటు అవసరమైతే నాయకులను కూడా మార్చాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో టిడిపి అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్యేల వ్యవహారశైలి తీవ్ర వివాదంగా ఉన్న విషయం తెలిసిందే. సత్యవేడు నియోజకవర్గంలో వైసిపి నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు టికెట్ ఇవ్వడం ద్వారా గత ఎన్నికల్లో టిడిపి విజయం దక్కించుకుంది. అయితే ఈ ఆనందం అత్యంత వేగంగా ఆవిరైంది. మహిళా నాయకురాలిని వేధించారన్న కేసులో ఆదిమూలం చిక్కుకోవడం అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే సదరు మహిళా నాయకురాలు మళ్లీ కేసును వెనక్కి తీసుకున్నప్పటికీ ఆదిమూలం మాత్రం యాక్టివ్ కాలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో టిడిపి మరో వ్యాపారవేత్తను రంగంలోకి దించింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిమూలం అలాగే వ్యాపారవేత్తకు మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి. తన అనుమతి లేనిదే నియోజకవర్గంలోకి ఎలా పర్యటిస్తారని తనకు చెప్పకుండా ఎలా వెళ్తారని ఆదిమూలం ప్రశ్నిస్తున్నారు. అయితే పార్టీ తనకు సంపూర్ణమైన హక్కులు కల్పించిందని అధికారం ఉందని వ్యాపారవేత్త చెబుతున్నారు. ఏది ఏమైనా నియోజకవర్గంలో తరచుగా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీకి ఇబ్బందులు తెస్తూనే ఉన్నాయి.
ఇక తిరువూరు నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం అందరికీ తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద వ్యవహారశైలితో పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నారన్నది వాస్తవం. ఇటీవల ఎంపీతో ఆయన భారీగానే రగడకు దిగారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేను మార్చాలన్నది స్థానికంగా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొలికపూడి కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఇటీవల లిఖితపూర్వకంగా సుమారు 12 మంది నాయకులు పార్టీకి సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో పరిస్థితి మార్చే దిశగా నాయకులను సమన్వయం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. అవసరమైతే వచ్చే ఎన్నికల నాటికి మార్పులు చేయాలని కూడా నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.
This post was last modified on January 6, 2026 10:23 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా…
ఏటా జనవరి వస్తోంది.. పోతుంది... సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది…
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…