Political News

నెటిజ‌న్ల కామెంట్‌: ఇప్పుడు ఎన్ని చెబితే ఏంటి ‘పీకే’ స‌ర్‌!

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. జ‌న్ సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిషోర్‌.. ఉర‌ఫ్ పీకే.. బీహార్ లో జ‌రిగిన తాజా అసెంబ్లీ ఎన్ని క‌ల్లో చావు దెబ్బ‌తిన్నారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న క‌నీసం 230 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిలబెట్టినా.. ఒక్క‌రు కూడా డిపాజిట్ ద‌క్కించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌ని దారుణ స్థితికి చేరుకున్నారు.దీంతో పీకేకు ఉన్న ఇమేజ్ దాదాపు త‌గ్గిపోయింద‌న్న కామెట్లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు.. ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోవ‌ర్లు కూడా త‌గ్గు ముఖం ప‌ట్టారు.

ఇదిలావుంటే.. తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన పీకే.. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన తీరుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా ఎన్డీయే కూట‌మి విజ‌యంపై ఆయ‌న కామెంట్లు కుమ్మ‌రించారు. దేశ ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌యోజ‌నాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌పంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చింద‌న్నారు. ఇది స‌హ‌జ‌మే. అయితే.. ఇలా తెచ్చిన సొమ్ములో 14 వేల కోట్ల రూపాయ‌ల‌ను బీహార్ ఎన్నిక‌ల‌కు ఖ‌ర్చు చేశార‌ని చెప్పారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న ఓ కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు.

“మీకు గుర్తుండే ఉంటుంది.. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు.. రెండు మూడు రోజుల్లో ఎన్నిక‌ల కోడ్ వ‌స్తుంద‌నగా.. రాష్ట్రంలో ప్ర‌తి మ‌హిళ‌కు నితీష్ ప్ర‌భుత్వం 10 వేల రూపాయ‌లు బ్యాంకుల్లో వేసింది. ఆ డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఎలా వ‌చ్చిందో లెక్కలు చెప్ప‌లేదు. దీనికి నెల ముందు.. రాష్ట్రంలో ఉద్యోగులు జీతాలు పెంచ‌మ‌ని డిమాండ్ చేశారు. ఆ స‌మ‌యంలో సీఎం నితీష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఖ‌జానా ఖాళీ అయింద‌న్నారు. మ‌రి అలాంట‌ప్పుడు మ‌హిళ‌ల‌కు ఇచ్చేందుకు అన్ని వేల కోట్లు ఎక్కడ నుంచి వ‌చ్చాయి?. అంటే ప్ర‌పంచ బ్యాంకు ఇచ్చిన సొమ్మును కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. అది ఎన్నికల కోస‌మే ఇచ్చింది.” అని పీకే ఆరోపించారు.

తాజా ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్యయుతంగా జ‌ర‌గ‌లేద‌న్న పీకే.. ఇవి పూర్తిగా ఓటు కొనుగోలు చేయ‌డం ద్వారా మాత్ర‌మే జ‌రిగిన ఎన్నిక‌లుగా గుర్తించామ‌న్నారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌ సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే.. పీకే చేసిన వ్యాఖ్య‌ల‌పైనెటిజ‌న్లు పెద‌వి విరుస్తున్నారు. ఇవ‌న్నీ ఇప్పుడు ఎవ‌రు న‌మ్ముతారు? అని కొంద‌రు కామెంట్లు చేస్తే.. మ‌రికొంద‌రు “మీరు ఓ 50 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుని ఉంటే ఇలానే చెప్పేవారా?” అని ప్ర‌శ్నించారు. కాగా.. ఈ ఎన్నిక‌ల్లో పీకే పార్టీ 3.3 శాతం ఓట్లు ద‌క్కించుకుంద‌ని ఎన్నిక‌ల సంఘం డేటా వెల్ల‌డించింది.

This post was last modified on November 16, 2025 5:06 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

34 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

53 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

58 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

5 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago