తప్పులు చేయడం కొందరు రాజకీయ నేతలకు అలవాటుగా మారింది. అయితే.. ఆ తప్పులను కూడా చేతికి మట్టి అంటకుండా చేసేవారు కొందరు ఉన్నారు. కానీ.. తాజాగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన తప్పులో కీలకమైన లాజిక్‌ను ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి.. పవన్ కల్యాణ్ బయట పెట్టారు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారన్న చర్చ కూడా సాగుతోంది.
ఏం జరిగింది..?
పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి తిరుగులేదు. వరుస విజయాలు.. ఇతర పార్టీల హవాను నియంత్రించడంతో ఆయన ఇక్కడ చెలరేగిన విషయంతెలిసిందే. వైసీపీ హయాంలో అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే పలు అటవీ భూములను ఆయన ఆక్రమించుకుని.. వారి కుటుంబ సభ్యుల పేరుతో ఆయన రిజిస్టర్ చేయించుకున్నారని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇలా.. పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం అటవీ భూముల్లో ఆక్రమించుకున్న స్థలాలపై పవన్ దృష్టి పెట్టారు.
ఏకంగా 104 ఎకరాల భూములను(పూర్తిగా అటవీ భూములు) పెద్దిరెడ్డి తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించారు. అయితే.. వీటిని ఆయన తన వారసత్వ భూములుగా వచ్చాయని రికార్డుల్లో పేర్కొన్నారు. ఇక్కడే ఆయన లాజిక్ మిస్సయ్యారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. పొలాలు.. స్థలాల విషయంలో వారసత్వంగా భూములు సంక్రమించడం పరిపాటే. కానీ, అటవీ ప్రాంతంలో వారసత్వం ఏంటన్నది పవన్ ప్రశ్న.
అంతేకాదు.. అటవీ ప్రాంతంలో అది కూడా మధ్యలో తమకు వారసత్వంగా భూములు వచ్చాయని పెద్ది రెడ్డి పేర్కొనడం వివాదానికి దారి తీసింది. ఈ విషయాన్ని గుర్తించిన పవన్ కల్యాణ్.. ఆయా వివరాలను సేకరించి.. వారసులు ఎవరు? ఎవరికి ఎలా భూములు దక్కాయి.? దీనిలో వాస్తవం ఎంత? అనే విషయాలపై నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరిణామం పెద్దిరెడ్డి శిబిరంలో కలకలం రేపింది. మరిదీనిపై అధికారులు ఎలాంటి నివేదిక ఇస్తారో చూడాలి. గతంలో కూడా.. సర్వే చేసినప్పుడు.. పెద్దిరెడ్డి భూములకు అధికారులు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.
This post was last modified on November 14, 2025 11:15 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…