Political News

సాయిరెడ్డి కుమార్తెకు షాక్‌

ఒక అక్ర‌మం.. అన్యాయం చేయాలంటే.. ఎంతో సాహ‌సం ఉండాలి. పైగా ఎవ‌రినో ఒక‌రిని చూసైనా నేర్చు కోవాలి. ఇలానే స్ఫూర్తి పొందిన వైసీపీ మాజీ నాయ‌కుడు, మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కుమార్తె.. నేహా రెడ్డి ఇప్పుడు కోట్ల సొమ్మును వ‌దిలించుకుంటున్నారు. అక్ర‌మ‌మ‌ని తెలిసి కూడా.. స‌క్ర‌మంగా మార్చే ప్ర యత్నాలు చేసి.. చిక్కుల్లో ప‌డ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు… అనేక మంది అక్ర‌మాలు చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అయితే.. సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి.. మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. రుషికొండ‌పై అప్ప‌టి ప్ర‌భు త్వం భారీ భ‌వ‌నాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టాల‌కు వ్య‌తిరేక‌మ‌ని పేర్కొంటూ.. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌ను తెర‌మీదికి వ‌చ్చాయి. అయినా.. వైసీపీ ప్ర‌భుత్వం ఎక్క‌డా వినిపించుకోలేదు. పైగా.. నిర్మాణాల‌ను కొన‌సాగించి.. 500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసింది. ఈ నేప‌థ్యంలో సాయిరెడ్డి కుమార్తె కూడా.. ఇలాంటి నిర్మాణాల‌కే ప్రాధాన్యం ఇచ్చారు.

భీమిలిలోని బీచ్‌లో స‌ముద్ర తీరాన్ని ఆక్ర‌మించి రిసార్టు ఏర్పాటు చేయాల‌ని నేహారెడ్డి ప్ర‌య‌త్నించారు. అప్ప‌ట్లో వైసీపీ ప్ర‌భుత్వం ఉండ‌డంతో నిర్మాణాలు ముందుకు సాగాయి. కానీ.. వాస్త‌వానికి కేంద్ర ప‌ర్యావ ర‌ణ‌, స‌ముద్ర చ‌ట్టాల ప్ర‌కారం.. బీచ్‌లో ఎలాంటి రిసార్టులు క‌ట్టేందుకు అనుమ‌తిలేదు. దీని గురించి తెలిసినా.. జ‌గ‌న్ బాట‌లోనే మొండిగా ముందుకు సాగారు సాయిరెడ్డి కుమార్తె. పెద్ద ఎత్తున ప్ర‌హ‌రీ నిర్మించారు. అనంత‌రం.. రిసార్టుకు అవ‌స‌ర‌మైన నిర్మాణాల‌ను కూడా ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.

ఇంత‌లో ఇది కోర్టుకు చేరింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన గోడ‌ను కూల్చేయ‌డంతోపాటు.. ప‌ర్యావ‌రణ ప‌రిర‌క్ష‌ణ‌కు భంగం వాటిల్లేలా చేసినందుకు.. 17 కోట్ల రూపాయ‌ల ఫైన్ ప‌డింది. ఇక‌, ఇప్ప‌టికే క‌ట్టిన గోడ‌ను కూల్చేందుకు ఒక‌సారి 48 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెల్లించారు. అయితే.. ఆ సొమ్ము స‌గం గోడ‌ను మాత్ర‌మే కూల్చేందుకు స‌రిపోయాయ‌ని కార్పొరేష‌న్ స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు 37 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కోరింది. దీనిని తాజాగా హైకోర్టు కూడా స‌మ‌ర్థించింది. సో.. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ బాట‌లో మొండిగా న‌డిచి.. సాయిరెడ్డి కుమార్తె..చేతి చ‌మురు బాగానే వ‌దిలించుకుంటున్నార‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on November 7, 2025 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

38 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago