Political News

అమ‌రావ‌తికి ‘మైక్రోసాఫ్ట్’ మ‌ణిహారం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాలు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి రాజ‌ధానిలో ప్రారంభం కానున్న క్వాంట‌మ్ వ్యాలీలో తాను కూడా భాగ‌స్వామ్యమ‌య్యేందుకు ముందుకు వ‌చ్చింది. దీనిలో భాగంగా ఏకంగా 1200 క్యూబిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. దీనికి సంబంధించి గ‌తంలోనే సీఎం చంద్ర‌బాబు.. మైక్రోసాఫ్ట్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయి. దీనిపై తాజాగా ప్ర‌భుత్వానికి నివేదిక అందింది.

ఎంత పెట్టుబ‌డి?

మైక్రోసాఫ్ట్.. రాజ‌ధాని అమ‌రావతిలో ఏర్పాటు చేసే 1200 క్యూబిట్ భారీ క్వాంట‌మ్ కంప్యూట‌ర్ కోసం.. ఏకంగా 1,772 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది. ఈ నిధుల‌తో క్వాంట‌మ్ వ్యాలీలో 4 వేల చ‌ద‌ర‌పు అడుగుల భ‌వ‌నాన్ని నిర్మించ‌నున్నారు. త‌ద్వారా.. స్థానికంగా ఐటీ చ‌దివిన వారికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. తొలిద‌శ‌లో 1500 మందిని రిక్రూట్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై, బెంగ‌ళూరుల‌కు వెళ్లిన ఏపీ యువ‌త‌కు.. ఇక్క‌డే అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయ‌ని పేర్కొంది.

ఇదే కాదు..

అమ‌రావ‌తిలో క్వాంట‌మ్ కంప్యూటింగ్‌ను ఏర్పాటు చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఆయ‌న చొర‌వ తీసుకుని సంప్ర‌దించిన కంపెనీల‌తో పాటు.. మ‌రిన్ని సంస్థ‌లు కూడా.. స్వ‌చ్ఛందంగా వ‌చ్చేందుకు, ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నాయి. వీటితో అంత‌ర్జాతీయంగా కూడా ఏపీ రాజ ధాని పేరు మార్మోగ‌నుంది. ప్ర‌ధానంగా జ‌పాన్‌కు చెందిన కంపెనీలు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతున్న‌ట్టు స‌ర్కారు పేర్కొంది.

ఇవీ.. వ‌చ్చేవి..

1) జపాన్‌కు చెందిన ఫుజిసు ఐటీ కంపెనీ 64 క్యూబిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది.

2) కేంద్ర ప్రభుత్వం.. ఫ్యాబ్రికేషన్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నుంది.

3) మైక్రోసాఫ్ట్ స‌హా.. గూగుల్ ప్ర‌తిపాదిత కంపెనీలు రానున్నాయి.

This post was last modified on November 7, 2025 9:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

23 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

46 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

56 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago