Political News

“కేసులు పెట్టారా.. డిజిట‌ల్ బుక్కు ఉందిగా”

వైసీపీ నేత‌ల‌పై తాజాగా కృష్ణాజిల్లా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. మంగ‌ళ‌వారం వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. రైతుల ప‌రామ‌ర్శ‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల వ‌చ్చిన మొంథా తుఫాను కార‌ణంగా.. ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో పంట పొలాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ఈ క్ర‌మంలో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ మంగ‌ళ‌వారం.. కృష్ణాజిల్లాలో ప‌ర్య‌టించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కులు నానా హంగామా చేశారు. ర‌హ‌దారుల‌కు అడ్డంగావాహ‌నాలు ఆప‌డం.. ర్యాలీలు నిర్వ‌హించ‌డం తెలిసిందే.

నిజానికి జ‌గ‌న్ స‌హా.. కొద్ది మందికి మాత్రమే కృష్ణాజిల్లా పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. అయితే.. దీనిని ఖాత‌రు చేయ‌ని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రి ఒక‌రు.. భారీ ఎత్తున పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను మోహ‌రించారు. దీంతో ప‌లు చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్తాయి. ఒక‌చోట అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుని రోగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఇక‌.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌.. పామ‌ర్రు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగి.. వారిని దూషించార‌ని పోలీసులు తెలిపారు. అదేవిధంగా విజ‌య‌వాడ‌కు చెందిన యువ నాయ‌కుడు ఒక‌రు కూడా ఇలానే చేశారని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో స‌ద‌రు నాయ‌కుల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. తాజాగా బుధ‌వారం సాయంత్రం వారికి నోటీసులు కూడా సిద్ధం చేసిన‌ట్టు తెలిపారు. అయితే.. ఈవ్య‌వ‌హారం తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో హాట్ టాపిక్ అయింది. ముందుగానే అనుమ‌తి తీసుకున్నామ‌ని.. పోలీసుల‌ను కూడా అలెర్ట్ చేశామ‌ని వైసీపీ నాయ‌కులు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌పై కేసులు పెట్టార‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యంపై స్పందించిన కీల‌క నాయ‌కుడు, మాజీ స‌ల‌హాదారు ఒక‌రు.. “కేసులు పెట్టారా.. అయితే.. డిజిట‌ల్ బుక్కు ఉందిగా అందులో రికార్డు చేయండి” అని లైట్ గా వ్యాఖ్యానించిన‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు. తాము సీరియ‌స్‌గా తీసుకుంటే.. కీల‌క నేత ఇలా వ్యాఖ్యానించ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 6, 2025 9:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

38 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago